బిజినెస్

కరవు నివారణకు బాబు వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: కరవును శాశ్వతంగా పరిష్కరించాలంటే నదుల అనుసంధానం ఒక్కటే దారి అని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఈ విషయం చెప్పినట్లు ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కరవును శాశ్వతంగా నివారించేందుకు అనుసరించవలసిన స్వల్ప, దీర్ఘ కాలిక చర్యల గురించి చర్చించేందుకే మోదీ ఇంత వరకు పదిమంది ముఖ్యమంత్రులతో సమావేశం జరిపారని చెప్పారు. ప్రధాని ఏర్పాటు చేసిన సమావేశానికి బాబుతోపాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రధాన కార్యదర్శి టక్కర్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన వివిధ చర్యలు, అనుసరిస్తున్న వ్యూహాన్ని ప్రధాన మంత్రికి ప్రజెంటేషన్ రూపంలో వివరించినట్లు బాబు తెలిపారు. దేశంలోని నదులను అనుసంధానం చేయాలని, మిగులు జలాలున్న నదులను నీటి కొరత ఉన్న నదులతో అనుసంధానం చేయటం వలన దేశాన్ని సస్యశ్యామలం చేయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. రెయిన్ గన్ విధానం, స్ప్రింక్లర్ల విధానం ద్వారా లక్షలాది ఎకరాల్లోని పంటలను ఎలా కాపాడగలుగుతామనేది ప్రధాని దృష్టికి తెచ్చారు. మైక్రో ఇరిగేషన్‌ను మరో 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తామన్నారు. పోలవరం, నగరి, హంద్రీనీవా, తోటపల్లి, వంశధార ప్రాజెక్టులను త్వరగా నిర్మించి సాగునీరు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 12,500 చెక్ డ్యాంలను నిర్మించాలన్నది తమ ప్రభుత్వం లక్ష్యమని ఆయన వెళ్లడించారు. భూగర్భ జలాలను రీచార్జీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామంటూ వీటి వివరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,254 ఫిజియోమీటర్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.