బిజినెస్

సిండికేట్ బ్యాంక్‌కు మొండి బకాయిల సెగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ సిండికేట్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో ఏకంగా 2,158.17 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. బ్యాంక్ మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ), అగంతుక రుణాలు 2,411.83 కోట్ల రూపాయలకు చేరుకోవడమే కారణం. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చి త్రైమాసికంలో 416.92 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేసింది. ఈ సమయంలో మొండి బకాయిలు 715.30 కోట్ల రూపాయలుగానే ఉన్నట్లు మంగళవారం బ్యాంక్ తెలియజేసింది. ఇక 2015-16 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనూ 119.67 కోట్ల రూపాయల నష్టాన్ని బ్యాంక్ అందుకుంది. ఆదాయం విషయానికొస్తే ఈ జనవరి-మార్చిలో 6,524.65 కోట్ల రూపాయలుగా, గత జనవరి-మార్చిలో 6,599.13 కోట్ల రూపాయలుగా ఉంది. స్థూల నిరర్థక ఆస్తులు నిరుడుతో చూస్తే 6,442.38 కోట్ల రూపాయల నుంచి 13,832.16 కోట్ల రూపాయలకు పెరిగాయి. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం బ్యాం క్ 1,643.49 కోట్ల రూపాయల నష్టా న్ని పొందింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 1,522.93 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఆదా యం 2015-16లో 25,706.51 కోట్ల రూపాయలుగా, 2014-15లో 23,72 4.75 కోట్ల రూపాయలుగా ఉంది.