బిజినెస్

మార్కెట్‌కు ఎగ్జిట్ పోల్స్ జోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 17: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లోనే ముగిశాయి. సోమవారం లాభాలు అందుకున్న నేపథ్యంలో అసోం అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బిజెపి అధికారంలోకి వస్తుందన్న అంచనాలు.. ఆ లాభాలను కొనసాగేలా చేశాయి. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 120.38 పాయింట్లు పుంజుకుని 25,773.61 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 7,890.75 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, ఐరోపా మార్కెట్లు కూడా లాభాలతో మొదలవడం.. భారతీయ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. ఇకపోతే తమిళనాడులో డిఎమ్‌కె-కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో సన్ టివి షేర్ విలువ సోమవారం ముగింపుతో చూస్తే ఏకంగా 9.76 శాతం ఎగిసి 431.65 రూపాయలకు చేరింది. సన్ టివి అధినేత కళానిధి మారన్.. డిఎమ్‌కె చీఫ్ కరుణానిధి మనవడు కావడమే దీనికి కారణం. ఆయా రంగాలవారీగా చూస్తే చమురు, గ్యాస్, రియల్టీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఫైనాన్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎనర్జీ, ఐటి, బ్యాంకింగ్ రంగాల షేర్లకు మదుపరుల కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే విద్యుత్, టెలికామ్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, వీటి షేర్ల విలువ 0.39 శాతం నుంచి 0.16 శాతం మేర పడిపోయింది.