బిజినెస్

స్పైస్‌జెట్ ‘యానివర్సరీ సేల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 17: దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. దేశ, విదేశీ విమానయాన ప్రయాణీకుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. సంస్థ విమానయాన సేవలు ప్రారంభమై 11 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పరిమిత వ్యవధికిగాను దేశీయంగా 511 రూపాయల కనిష్ట ధర టిక్కెట్ (పన్నులు, ఇతరత్రా ఫీజులు అదనం)ను ప్రకటించింది. అలాగే అంతర్జాతీయ విమాన ప్రయణీకుల కోసం కూడా కనిష్టంగా 2,111 రూపాయల టిక్కెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ టిక్కెట్లకు సంబంధించిన బుకింగ్స్ మంగళవారం నుంచి ప్రారంభమవగా, గురువారం అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. దేశీయ ప్రయాణం కోసం బుక్ చేసుకున్న టిక్కెట్లను జూన్ 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు వినియోగించుకోవచ్చు. అలాగే విదేశీ ప్రయాణం కోసం బుక్ చేసుకున్న టిక్కెట్లను జూన్ 1 నుంచి జూలై 20 వరకు వాడుకోవచ్చు. స్పైస్‌జెట్ విమానాలకు, సంస్థ నెట్‌వర్క్ పరిధిలో మాత్రమే ఈ టిక్కెట్లు చెల్లుబాటు అవుతాయి.