బిజినెస్

హైదరాబాద్‌లో యాపిల్ సెంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 17: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ ఈ నెల 19 (గురువారం)న హైదరాబాద్‌లో ఓ డెవలప్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి, రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ మంగళవారం ఇక్కడ చెప్పారు. అయితే ఈ వారం యాపిల్ సిఇఒ టిమ్ కుక్ భారత్‌లో పర్యటించనుండగా, ఆయన ఈ సెంటర్ ప్రారంభోత్సవానికి వస్తారా? లేదా? అన్నది ఇంకా తెలియదన్నారు. ‘సెంటర్‌ను ప్రారంభించడానికి యాపిల్ సంస్థకు చెందిన ఓ బృందం గురువారం హైదరాబాద్‌కు వస్తోంది. కానీ ఈ బృందంలో ఎవరుంటారనేది మాకు తెలియదు. యాపిల్ సిఇఒ టిమ్ కుక్ హాజరవుతారా? లేదా అన్నదానిపై స్పష్టమైన సమాచారం లేదు. మేము కూడా దీని గురించే ఆరా తీస్తున్నాం. ఆ సమాచారం కోసం వేచి చూస్తున్నాం.’ అని రంజన్ పిటిఐకి తెలిపారు. కాగా, యాపిల్ సంస్థకు చెందిన పలువురు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులను కలిశారని, తమకు అన్నివిధాలా సహకరించాలని, కావాల్సిన అనుమతులను మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేసినట్లు రంజన్ చెప్పారు. ‘యాపిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం నానక్‌రామ్‌గూడలోగల టిష్మన్ స్పేయర్‌కు చెందిన ఓ భవనాన్ని కూడా సంస్థ గుర్తించింది. అందుకు అనుగుణంగా మేము కూడా వివిధ శాఖల నుంచి అనుమతులు వేగంగా అదేలా చూస్తున్నాం.’ అని రంజన్ అన్నారు. అయితే ఈ సెంటర్ కోసం యాపిల్ చేస్తున్న పెట్టుబడుల వివరాలను మాత్రం రంజన్ తెలియపరచలేదు. అయితే ఈ సెంటర్‌పై ఇప్పటికే యాపిల్ 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. క్యాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న యాపిల్ సంస్థ.. ఐఫోన్, ఐప్యాడ్‌లను ఉత్పత్తి చేస్తున్నది తెలిసిందే. ఈ సంస్థ సిఇఒ టిమ్ కుక్ భారత్‌కు మంగళవారం రాత్రి వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియపరచగా, ఈ పర్యటనలో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో యాపిల్ పెట్టుబడులపై చర్చించనున్నారు. పలువురు కేంద్ర మంత్రులనూ కుక్ కలవనున్నారు. కాగా, కుక్.. హైదరాబాద్, బెంగళూరుల్లో పర్యటిస్తారని తెలుస్తున్నప్పటికీ, స్పష్టమైన సమాచారం మాత్రం లేదు. మొత్తానికి ప్రపంచ స్మార్ట్ఫోన్ మార్కెట్‌లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో యాపిల్ సిఇఒ కుక్ పర్యటన.. దేశంలో ఆ సంస్థ మార్కెట్‌ను మరింత పెంచడానికే అన్న సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇంతకుముందు కుక్ చైనాలోనూ పర్యటించారు. స్మార్ట్ఫోన్ వినియోగంలో అమెరికా తర్వాత భారత్ ఉండగా, ఇక్కడి మార్కెట్‌లో గడచిన ఏడాది కాలంలో యాపిల్ ఐఫోన్ అమ్మకాలు 56 శాతం పెరగడం గమనార్హం. దీంతో భారత మార్కెట్ ఆ సంస్థ ప్రత్యేకంగా దృష్టి సారించిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే మంగళవారం రాత్రి 11:45 గంటలకు ముంబయకి చేరుకునే కుక్ కోసం.. చారిత్రాత్మక తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్‌లో ఒక రాత్రికి 87,000 రూపాయలు ఖరీదు చేసే గదిని బుక్ చేసినట్లు సమాచారం.