బిజినెస్

ఇక యాప్స్ మ్యాపింగ్ ఇక్కడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఇక్కడ ఏర్పాటుచేస్తున్న డెవలప్‌మెంట్ సెంటర్‌ను గురువారం ఆ సంస్థ సిఇఒ టిమ్ కుక్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ హాజరవుతున్నారు. నానక్‌రామ్‌గూడలో రియల్ ఎస్టేట్ సంస్థ టిష్మన్ స్పేయర్‌కు చెందిన భవనంలో దాదాపు 1.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ డెవలప్‌మెంట్ సెంటర్‌పై ఇప్పటికే యాపిల్ సంస్థ 100 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టింది. ఈ సెంటర్‌ను తమ యాప్స్‌కు మ్యాపింగ్ సెంటర్‌గా యాపిల్ వినియోగించనున్నట్లు తెలుస్తోంది. క్యాలిఫోర్నియా కేంద్రంగా నడుస్తున్న యాపిల్.. ఐఫోన్, ఐప్యాడ్‌లను తయారు చేస్తున్నది తెలిసిందే. కాగా, ఈ ప్రారంభోత్సవానికి మీడియాను దూరంగా ఉంచనున్నట్లు యాపిల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
బెంగళూరులోనూ..
న్యూఢిల్లీ: బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ లాబొరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు యాపిల్ సిఇఒ టిమ్ కుక్ బుధవారం ప్రకటించారు. సంస్థకు చెందిన ఐఒఎస్ వేదికపై పనిచేసే స్టార్టప్‌లు, డెవలపర్లకు తోడ్పాటుగా దీన్ని నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. 2017 ప్రథమార్ధంలో ఈ లాబొరేటరీని ప్రారంభిస్తామని తెలిపారు. కాగా, యాపిల్ సిఇఒగా నియమితులైన తర్వాత తొలిసారిగా భారత్‌లో కుక్ పర్యటిస్తుండగా, మంగళవారం అర్ధరాత్రి ఆయన ముంబయికి చేరుకున్నారు. నాలుగు రోజుల ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు.
ఐసిఐసిఐ ప్రధాన కేంద్రంలో..
ముంబయి: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం టిమ్ కుక్ సందర్శించారు. ఇక్కడి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోగల ఐసిఐసిఐ బ్యాంక్ టవర్స్‌కు చేరుకున్న కుక్.. అక్కడ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్‌ను కలుసుకున్నారు. యాపిల్ వాచ్‌పై తొలుత బ్యాంకింగ్ అప్లికేషన్‌ను పరిచయం చేసిన బ్యాంకర్లలో ఐసిఐసిఐ కూడా ఉంది. ఇదిలావుంటే అంతకుముందు వొడాఫోన్ ఇండియా అధిపతి సునీల్ సూద్‌నూ కలిసిన కుక్.. భారతీ ఎయిర్‌టెల్ యాజమాన్యంతోనూ చర్చించనున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్ర్తి, టిసిఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ చంద్రశేఖరన్, మరికొందరు స్టార్టప్ నిర్వహకులనూ కుక్ కలుస్తారని బుధవారం ఉదయం ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.
జూనియర్ అంబానీతో..
ఇక టిమ్ కుక్ పర్యటన బిజిబిజిగా సాగుతుండగా, బుధవారం ఆయన సెంట్రల్ ముంబయిలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించారు. అయితే ఈ ఆలయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ.. కుక్ కంటబడ్డాడు. మొత్తానికి కుక్ బిజి పర్యటనలో అనుకోకుండా ఆయన్ను కలుసుకునే అవకాశం జూనియర్ అంబానీకి దక్కింది. కాగా, ముకేశ్ అంబానీతో కుక్ సమావేశమవుతారని తెలుస్తోంది.

బుధవారం ముంబయలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో సిఇఒ టిమ్ కుక్