బిజినెస్

పేమెంట్స్ బ్యాంక్‌కు గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 20: టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడిఎఫ్‌సి బ్యాంక్‌లతోపాటు సన్ ఫార్మా వ్యవస్థాపక అధిపతి దిలీప్ సంఘ్వీ.. పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటును విరమించుకున్నారు. ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. రెండు నెలల క్రితం పేమెంట్స్ బ్యాంక్స్ రేసు నుంచి చోళమండలమ్ గ్రూప్ వైదొలిగిన నేపథ్యంలో ఇప్పుడు ఓ పేమెంట్స్ బ్యాంక్‌ను కలిసి ఏర్పాటు చేయాలనుకున్న దిలిప్ సంఘ్వీ, ఐడిఎఫ్‌సి బ్యాంక్, టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తమ ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించాయి. నిరుడు సెప్టెంబర్‌లో ఈ జాయింట్ వెంచర్‌తోపాటు రిలయన్స్-ఎస్‌బిఐ, వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్, పేటిఎమ్ తదితర 11 వెంచర్లు, ఇండివిడ్యువల్ ధరఖాస్తులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఆమోదించింది. వీటికి సూత్రప్రాయ అనుమతిని ఇచ్చింది. అయితే వీటిలో ఏ ఒక్క వెంచర్, సంస్థ ఇప్పటిదాకా పేమెంట్స్ బ్యాంక్ సేవలను ఆరంభించకపోగా, రెండు తప్పుకోవడం గమనార్హం.

నఐటిసి లాభం రూ. 2,495 కోట్లు

న్యూఢిల్లీ, మే 20: బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసి లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 5.67 శాతం పెరిగి 2,495.20 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చి వ్యవధిలో 2,361.18 కోట్ల రూపాయల నికర లాభాన్ని అందుకుంది. మార్కెట్ మందగమన పరిస్థితుల్లోనూ నికర అమ్మకాలు 9.51 శాతం పెరగడం సంస్థ లాభాలను వృద్ధిపథంలో నిలిపాయి. పోయినసారి 9,188.25 కోట్ల రూపాయలుగా ఉన్న అమ్మకాలు.. ఈసారి 10,062.38 కోట్ల రూపాయలకు చేరుకున్నాయని ఓ ప్రకటనలో ఐటిసి శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు వెల్లడించింది. ఇందులో సిగరెట్లతో కూడిన ఎఫ్‌ఎమ్‌సిజి వ్యాపార ఆదాయం 8.35 శాతం వృద్ధితో 7,343.29 కోట్ల రూపాయలుగా నమోదైంది.

ఐడిబిఐ నష్టం రూ. 1,736 కోట్లు

న్యూఢిల్లీ, మే 20: దేశీయ బ్యాంకింగ్ రంగాన్ని మొండి బకాయిలు కుదిపేస్తూనే ఉన్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ.. క్రిందటి ఆర్థిక సంవత్సరం (2015-16) ఆఖరి త్రైమాసికం, ఈ జనవరి-మార్చి కాలంలో 1,735.81 కోట్ల రూపాయల నష్టాన్ని అందుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 545.94 కోట్ల రూపాయల లాభాన్ని బ్యాంక్ అందుకోగా, ఈసారి నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) రెండింతలు పెరగడమే ఈ స్థాయి నష్టాలకు అసలు కారణమని బ్యాంక్ శుక్రవారం చెప్పింది. కాగా, ఆదాయం కూడా గతంతో పోల్చితే 9,382.37 కోట్ల రూపాయల నుంచి 8,274.58 కోట్ల రూపాయలకు పడిపోయింది. ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌లు 500 కోట్ల రూపాయల నుంచి 5,000 కోట్ల రూపాయలకుపైగా నష్టాలను చవిచూసినది తెలిసిందే.

48,700 ఫోర్డ్
ఎకోస్పోర్ట్ ఎస్‌యువిల రీకాల్

న్యూఢిల్లీ, మే 20: ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థ ఫోర్డ్ ఇండియా.. తమ కంపాక్ట్ ఎస్‌యువి ఎకోస్పోర్ట్ మోడళ్లను రీకాల్ చేసింది. ఇంధన, బ్రేక్ లైన్లు, రేర్ సీట్ బ్యాక్‌రెస్ట్ సమస్యలను సరిదిద్దడానికి 48,700 యూనిట్లను వెనక్కి పిలిచింది. ఇంతకుముందు కూడా 2013 ఏప్రిల్ నుంచి 2014 జూన్ మధ్య దాదాపు 48,000 ఎకోస్పోర్ట్ డీజిల్ కార్లను ఫోర్డ్ రీకాల్ చేసుకుంది. కాగా, ఈ ఏడాది జనవరి-్ఫబ్రవరి మధ్య తయారైన దాదాపు 700 ఎకోస్పోర్ట్ వినియోగదారులకు లేఖలను కూడా రాశామని, స్థానిక ఫోర్డ్ డీలర్లను కలిసి ఉచితంగా వాహన లోపాలను సరిదిద్దుకోవచ్చని చెప్పామని ఓ ప్రకటనలో ఫోర్డ్ ఇండియా స్పష్టం చేసింది.