బిజినెస్

సునీల్ మిట్టల్‌తో కుక్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సిఇఒ టిమ్ కుక్.. శుక్రవారం దేశీయ టెలికామ్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్‌ను కలిశారు. భారత్‌లో 4జి సేవల విస్తరణ తదితర అంశాలతోపాటు దేశీయ టెలికామ్ రంగ వృద్ధిపై వీరిరువురు చర్చించారు. దాదాపు గంటపాటు జరిగిన వీరి సమావేశంలో భారతీ ఎయిర్‌టెల్ ఇండియా, దక్షిణాసియా సిఇఒ గోపాల్ విఠల్ కూడా పాల్గొన్నారు. కాగా, హైక్ మెసెంజర్ వ్యవస్థాపక సిఇఒ కెవిన్ భారతీ మిట్టల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న కుక్.. ఇప్పటికే వొడాఫోన్ ఇండియా సిఇఒ సునీల్ సూద్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి, సిఇఒ చందా కొచ్చర్, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తి, టిసిఎస్ సిఇఒ ఎన్ చంద్రశేఖరన్‌లను కలుసుకున్నారు. ముంబయిలోని ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా కుక్ కంటబడ్డాడు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, క్రీడాకారులను కూడా కలుసుకున్న కుక్.. ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌నూ తిలకించారు. గురువారం హైదరాబాద్‌లో యాపిల్ మ్యాపింగ్ సెంటర్‌ను ప్రారంభించిన కుక్.. గోల్కొండ కోటను సందర్శించినది తెలిసిందే. కాగా, శనివారం ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు.
కుక్‌పై ప్రసాద్ ప్రశంసలు
కేంద్ర టెలికామ్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్.. టిమ్ కుక్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. దేశాభివృద్ధి కోసం కుక్‌తో కలిసి పనిచేస్తామని, వ్యాపార అవకాశాలను పెంచుకుంటామని శుక్రవారం ఇక్కడ అసోచామ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాలొ గన్న ప్రసాద్ చెప్పారు. యాపిల్ వంటి సంస్థ భారత ప్రగతిలో భాగస్వామ్యా న్ని కోరుకోవడం సంతోషమన్నారు. కాగా, రాబోయే 2-3 నెలల్లో 2,000 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు తెలిపారు.

మూడోరోజూ నష్టాలే

సెనె్సక్స్ 98, నిఫ్టీ 34 పాయింట్లు క్షీణత

ముంబయి, మే 20: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. పి-నోట్ల దుర్వినియోగానికి ఆస్కారం లేకుండా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ.. నిబంధనలను కఠినతరం చేయడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం కావడం మదుపరుల కొనుగోళ్ల శక్తిని దెబ్బతీశాయి.
ఫలితంగా శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 97.82 పాయింట్లు క్షీణించి 25,301.90 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 33.70 పాయింట్లు కోల్పోయి 7,749.70 వద్ద నిలిచింది. రియల్టీ, హెల్త్‌కేర్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, చమురు, గ్యాస్, టెలికామ్, ఐటి రంగాల షేర్ల విలువ 1.42 శాతం నుంచి 0.52 శాతం మేర పడిపోయింది. అయితే ఎఫ్‌ఎమ్‌సిజి రంగానికి చెందిన షేర్ల విలువ మాత్రం 0.19 శాతం పెరిగింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, సింగపూర్, జపాన్, చైనా సూచీలు 0.94 శాతం వరకు లాభపడ్డాయి. ఐరోపా మార్కెట్లలో ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, బ్రిటన్ మార్కెట్లూ 1 శాతం వరకు పుంజుకున్నాయి. అయనప్పటిక దేశీయ స్టాక్ మార్కెట్లపై అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సానుకూల ప్రభావం కనిపించలేదు. పార్టిసిపేటరీ నోట్ల నిబంధనలను సెబీ కఠినం చేయడమే దీనికి ప్రధాన కారణం.