బిజినెస్

కాకినాడ పోర్టులో జిఎమ్‌ఆర్ ఎల్‌ఎన్‌జి టెర్మినల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సముద్రతీరం వద్ద 471 కోట్ల రూపాయల పెట్టుబడితో ఓ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జి) టెర్మినల్‌ను జిఎమ్‌ఆర్ సంస్థ ఏర్పాటు చేస్తోంది. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖలోని నిపుణుల కమిటీ నిర్వహించిన సమావేశంలో జిఎమ్‌ఆర్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. దీంతో టెర్మినల్ నిర్మాణ ప్రకియలో సంస్థ నిమగ్నమైంది. ఆరంభంలో ఈ ప్రాజెక్టు వార్షిక సామర్థ్యం 1.75 మిలియన్ టన్నులు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో ఏడవ బెర్తు వద్ద సర్వే నెంబర్ 317/318లో ఈ టెర్మినల్‌ను నెలకొల్పనున్నట్లు ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ (ఇఎసి) పేర్కొంది. ఈ కమిటీ ఢిల్లీలో సమావేశమై ఈ ప్రాజెక్టుపై సమీక్షించింది. కాగా, ఎల్‌ఎన్‌జిని అన్‌లోడింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర త్తలపైనా సమీక్షించిన కమిటీ.. ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు కొన్ని నిబంధనలను ఖరారు చేస్తామని పేర్కొంది. ఈ ప్రాజెక్టు నిర్వహణకు 8 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుంది.