బిజినెస్

కోలుకున్న స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 24: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. వరుసగా నాలుగు రోజులపాటు నష్టాలను అందుకున్న సూచీలు.. ఎట్టకేలకు లాభాలను సంతరించుకున్నాయి. వచ్చే నెల జూన్‌లో అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్.. కీలక వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాల మధ్య మదుపరులు కార్పొరేట్ సంస్థల ఆశాజనక త్రైమాసిక ఆర్థిక ఫలితాలకే ప్రాధాన్యతనిచ్చారు.
అలాగే ఐరోపా స్టాక్ మార్కెట్లు ఆకర్షణీయమైన లాభాలతో ప్రారంభమవడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 75.11 పాయింట్లు పుంజుకుని 25,305.47 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 17.80 పాయింట్లు పెరిగి 7,748.85 వద్ద స్థిరపడింది. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్ల విలువ 0.32 శాతం నుంచి 0.18 శాతం మేర పెరిగింది. అయితే చమురు, గ్యాస్, హెల్త్‌కేర్ రంగాల షేర్ల విలువ 1.01 శాతం నుంచి 0.88 శాతం చొప్పున పడిపోయింది.
ఆసియా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు నమోదవగా, జపాన్ సూచీ 0.94 శాతం, హాంకాంగ్ సూచీ 0.11 శాతం చొప్పున లాభపడ్డాయి. చైనా సూచీ 0.77 శాతం నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు 1.35 శాతం వరకు లాభాలను పొందాయి.