బిజినెస్

బ్యాంక్ ఆఫ్ ఇండియా నష్టం రూ. 3,587 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 24: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థలు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నాయి. తాజాగా మరో ప్రభుత్వరంగ బ్యాంకైన బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 3,587 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో 56.14 కోట్ల రూపాయల నష్టాన్ని అందుకున్న బ్యాంక్.. ఈసారి మొండి బకాయిలు భారీగా పెరగడంతో భీకర నష్టాల పాలైంది. ఆదాయం కూడా క్రిందటిసారితో పోల్చితే 12,286.98 కోట్ల రూపాయల నుంచి 11,384.91 కోట్ల రూపాయలకు క్షీణించింది. స్థూల నిరర్థక ఆస్తులు (మొండి బకాయిలు) 49,879.13 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఇక మొత్తం 2015-16లో బ్యాంక్ నికర నష్టం 6,089 కోట్ల రూపాయలుగా ఉంది. 2014-15లో 1,708.92 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం 47,662.61 కోట్ల రూపాయల నుంచి 45,449.01 కోట్ల రూపాయలకు దిగజారింది.

‘అధిక వడ్డీరేట్లు వ్యాపార అవరోధాలు’
న్యూఢిల్లీ, మే 24: అధిక వడ్డీరేట్లు పరిశ్రమలు, చిన్న వ్యాపారాలపై దుష్ప్రభావం చూపుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గిస్తేనే.. బ్యాంకులు తక్కువ వడ్డీరేటుతో రుణాలివ్వగలుగుతాయంటూ పరోక్షంగా ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వైఖరిని మంత్రి తప్పుబట్టారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు, పరిశ్రమలు బ్యాంకింగ్ రుణాలపైనే ఆధారపడి నడుస్తాయని మంగళవారం ఇక్కడ ఓ వార్తా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుర్తుచేశారు.

‘7.8 శాతంగా జిడిపి వృద్ధి’
సింగపూర్, మే 24: భారత జిడిపి వృద్ధిరేటు గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 7.8 శాతానికి చేరవచ్చని సిటి గ్రూప్ అంచనా వేసింది. మెరుగైన ఆర్థిక కార్యకలాపాలే దీనికి కారణంగా మంగళవారం పేర్కొంది గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం. మరోవైపు వచ్చే ఏడాది (2017) భారత జిడిపి వృద్ధిరేటు 7.8 శాతంగా ఉండొచ్చని డ్యూషే బ్యాంక్ అంచనా వేసింది. ఈ ఏడాది 7.5 శాతంగా నమోదవుతుందని అభిప్రాయపడింది జర్మనీ బ్యాంకింగ్ దిగ్గజం. కాగా, 2017లో చైనా జిడిపి వృద్ధిరేటు 6.7 శాతంగానే ఉండొచ్చని డ్యూషే తెలిపింది.