బిజినెస్

విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిహెచ్‌ఇఎల్ సిఎండి బి ప్రసాదరావును కోరారు. విజయవాడలో 800 మెగావాట్లు, కృష్ణపట్నంలో మరో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ టెక్నాలజీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని బిహెచ్‌ఇఎల్ చేపట్టింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం విజయవాడలో తనను కలిసిన బిహెచ్‌ఇఎల్ సిఎండి బి ప్రసాదరావుకు రూ. 430 కోట్ల చెక్‌ను అందచేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, వచ్చే 42 నెలల్లోగా థర్మల్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆయన కోరారు. థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో ఎక్కడ రాజీపడకుండా నాణ్యతాయుతంగా నిర్మించాలని ఆయన బిహెచ్‌ఇఎల్ బృందానికి సూచించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఇంధన సంరక్షణ సంఘం ఐదు జాతీయ అవార్డులను గెలుచుకున్నందుకు అభినందించారు. గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఇంధన సంరక్షణ సంఘం కార్యనిర్వాహణాధికారి ఏ చంద్రశేఖర రెడ్డిని చంద్రబాబు ప్రశంసించారు అలాగే రాష్ట్రంలో విద్యుత్ లోటు రానివ్వకుండా చూడాలని ఆయన ఏపి ట్రాన్స్‌కో, జెన్కో అధికారులు, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్‌ను కోరారు. రైతులకు కోతలు లేకుండా నిరాటంకంగా విద్యుత్‌ను సరఫరా చేయాలన్నారు. పరిశ్రమలకు సమృద్ధిగా విద్యుత్ అందుబాటులో ఉందన్న ఆయన వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పుష్కలంగా లభిస్తున్నందున దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్, ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్, డైరెక్టర్లు పి సత్యమూర్తి, కె బలరాం, ఇంధన సంరక్షణ సంఘం సిఇఒ ఏ చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు.
chitram...
ప్రసాదరావుకు చెక్ అందిస్తున్న చంద్రబాబు

‘ఇంధన పొదుపులో ఏపి ఆదర్శం’

హైదరాబాద్, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన పొదుపునకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఇంధన సంరక్షణ సంఘం సిఇఒ ఏ చంద్రశేఖర రెడ్డి మంగళవారం తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఏపి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో విద్యుత్ పొదుపు చేసినందుకు నేషనల్ ఎనర్జీ సంఘం నుంచి తమకు ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించిందన్నారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా ఈ అవార్డు పొందడం ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణంగా పేర్కొన్నారు. రాష్ట్ర ఇంధన కార్యదర్శి అజయ్ జైన్, ఏపి ట్రాన్స్‌కో సిఎండి కె విజయానంద్, విద్యుత్ సలహాదారు రంగనాథం సారథ్యంలో రాష్ట్రంలో నిర్దేశించిన విధంగా విద్యుత్‌ను పొదుపు చేస్తామన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు.

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి ఇంధన పొదుపు అవార్డు అందుకుంటున్న దృశ్యం