బిజినెస్

టెక్ మహీంద్ర కూడా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 24: పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి అనుమతి పొందిన సంస్థల్లో ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ నేతృత్వంలోని జాయింట్ వెంచర్.. తాము పేమెంట్స్ బ్యాంక్‌ను ఏర్పాటు చేయదలుచుకోలేదని ఇటీవల ప్రకటించినది తెలిసిందే. అంతకుముందు చోళమండలమ్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కో పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు నుంచి వైదొలిగింది. ఇప్పుడు తాజాగా టెక్ మహీంద్ర కూడా ఇదే జాబితాలోకి చేరింది. బ్యాంక్ ఏర్పాటు సంస్థకు లాభించబోదన్న నిర్ణయానికి వచ్చిన టెక్ మహీంద్ర.. తాము పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు ఆలోచనను విరమించుకుంటున్నట్లు మంగళవారం తెలిపింది. ‘పేమెంట్స్ బ్యాంక్ వ్యాపారం లాభాల్లోకి రావడానికి చాలా సమయం పడుతుందని గ్రహించాం. పెట్టే పెట్టుబడుల దృష్ట్యా ఇది శ్రేయస్కరం కాదని అనిపిస్తోంది. అందుకే పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటును విరమించుకుంటున్నాం.’ అని సంస్థ ఎండి, సిఇఒ సిపి గుర్నాని చెప్పారు. ఆర్‌బిఐకి పేమెంట్ బ్యాంక్ లైసెన్స్‌ను ఇచ్చేస్తామని కూడా చెప్పింది. సంఘ్వీ నేతృత్వంలో టెలినార్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐడిఎఫ్‌సి బ్యాంక్ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు జాయింట్ వెంచర్‌గా మారాయి. కాగా, గత సంవత్సరం ఫిబ్రవరిలో పేమెంట్స్ బ్యాంక్‌ల కోసం 41 సంస్థలు దరఖాస్తు చేసుకోగా, ఆగస్టులో సంఘ్వీ, రిలయన్స్-ఎస్‌బిఐ, వొడాఫోన్, భారతీ ఎయిర్‌టెల్, పేటిఎమ్ తదితర 11 వెంచర్లు, ఇండివిడ్యువల్ ధరఖాస్తులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఆమోదించింది. వీటికి సూత్రప్రాయ అనుమతిని ఇచ్చింది. లైసెన్సును పొందిన 18 నెలల్లోగా సేవలు ప్రారంభించాల్సి ఉంది. అయితే వీటిలో ఏ ఒక్క వెంచర్, సంస్థ ఇప్పటిదాకా పేమెంట్స్ బ్యాంక్ సేవలను ఆరంభించకపోగా, మూడు సంస్థలు తప్పుకోవడం గమనార్హం. దీనిపై సోమవారం ఆర్‌బిఐ డిప్యూటి గవర్నర్ ముంద్ర తీవ్ర అసంతృప్తిని కూడా వెలిబుచ్చారు. చాలా దరఖాస్తులను పరిశీలించి కొన్నింటికే లైసెన్సులు అందించామని, కానీ వాటిలో ఇప్పుడు కొన్ని ఇలా బ్యాంకుల ఏర్పాటును విరమించుకుంటున్నాయని అన్నారు. తమ శ్రమకు విలువేది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయనప్పటికీ మంగళవారం టెక్ మహీంద్ర నిర్ణయం వెలువడటం గమనార్హం.
రెండింతలైన లాభం
న్యూఢిల్లీ: దేశీయ ఐటిరంగ సంస్థ టెక్ మహీంద్ర ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే దాదాపు రెండింతలు ఎగిసింది. ఈసారి 897.08 కోట్ల రూపాయలుగా ఉంటే, నిరుడు 472 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా క్రిందటిసారితో చూస్తే 12.5 శాతం పెరిగి 6,883.73 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతకుముందు ఇది 6,116.79 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ నికర లాభం 18.7 శాతం వృద్ధితో 3,118 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం 17.1 శాతం పెరిగి 26,494 కోట్ల రూపాయలుగా ఉంది.