బిజినెస్

మేక్ ఇన్ ఇండియాలో భాగస్వాములు కండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్వాంగ్జూ, మే 25: ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగస్వాములు కావాలని చైనా మదుపరులను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కోరారు. వివిధ కీలక రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలున్నాయని ఆయన వారికి వివరించారు. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్య బలోపేతానికి భారత ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా రాష్టప్రతి చైనాలో పర్యటిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో రెండో రోజైన బుధవారం ఇక్కడ జరిగిన భారత్-చైనా వ్యాపార మండలి సమావేశంలో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ.. సమావేశానికి హాజరైన పారిశ్రామిక, వ్యాపార వర్గాలనుద్దేశించి మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వాణిజ్యం సమతూకంగా ఉంటే, ఇప్పుడు భారత్‌లో చైనా ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఉన్నట్లే, చైనాలోనూ భారత ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉంటుందన్నారు.

ఫెడెక్స్ చేతికి
టిఎన్‌టి ఎక్స్‌ప్రెస్
4.4 బిలియన్ యూరోలకు కొనుగోలు
న్యూఢిల్లీ, మే 25: టిఎన్‌టి ఎక్స్‌ప్రెస్‌ను హస్తగతం చేసుకున్నట్లు గ్లోబల్ లాజిస్టిక్స్ దిగ్గజం ఫెడెక్స్ బుధవారం ప్రకటించింది. 4.4 బిలియన్ యూరోలకు దీన్ని కొనుగోలు చేసినట్లు తెలిపింది. టిఎన్‌టి ఎక్స్‌ప్రెస్ కొనుగోలుతో అంతర్జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ పరిశ్రమ ఓ కొత్త రూపును సంతరించుకోనుందని ఫెడెక్స్ చైర్మన్, సిఇఒ ఫెడ్రిక్ డబ్ల్యు స్మిత్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ రెండు సంస్థల ఉద్యోగులు దాదాపు 4 లక్షలుగా ఉండొచ్చని స్మిత్ చెప్పారు. భారీ సిబ్బందింతో ఇక ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను విస్తరింపజేస్తామని చెప్పారు.

6 వారాల కనిష్టానికి
బంగారం ధరలు
న్యూఢిల్లీ, మే 25: బంగారం ధరలు బుధవారం 6 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. బులియన్ మార్కెట్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర 370 రూపాయలు పతనమై 29,200 రూపాయల వద్ద నిలిచింది. 99.5 స్వచ్ఛత కలిగిన పసిడి ధర 29,050 రూపాయల వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, జ్యుయెల్లర్ల నుంచి తగ్గిన డిమాండ్ మధ్య ఇటీవలి ట్రేడింగ్‌లలో బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది తెలిసిందే. ఇకపోతే కిలో వెండి ధర బుధవారం ట్రేడింగ్‌లో 50 రూపాయలు తగ్గి 39,450 రూపాయలను చేరింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే మంగళవారం న్యూయార్క్‌లో ఔన్సు పసిడి ధర ఏకంగా 21.38 డాలర్లు పడిపోయి 1,226.90 డాలర్లు పలికింది.

6న ప్రభుత్వ బ్యాంకర్లతో జైట్లీ సమీక్ష
న్యూఢిల్లీ, మే 25: మొండి బకాయిలు, భీకర నష్టాల మధ్య ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే నెల 6న సమావేశం కానున్నారు. ఈ జనవరి-మార్చి త్రైమాసికానికిగాను ఇప్పటిదాకా ఆర్థిక ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల్లో మెజారిటీ సంస్థలు భారీగా నష్టపోయినది తెలిసిందే. నిరర్థక ఆస్తుల దృష్ట్యా 11 బ్యాంకుల నష్టాల విలువ 20,000 కోట్ల రూపాయలపైనే ఉంది. మిగతా బ్యాంకుల లాభాలు కూడా పెద్ద మొత్తంలో క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమీక్షించనున్నారు.

నాల్కో ‘బై బ్యాక్ షేర్’ ఆఫర్
న్యూఢిల్లీ, మే 25: అల్యూమినియం తయారీదారు నాల్కో.. 2,835 కోట్ల రూపాయల విలువైన షేర్లను మదుపరుల నుంచి తిరిగి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ బోర్డు నుంచి ఆమోదం లభించిందని బుధవారం పేర్కొంది. 2,835 కోట్ల రూపాయలకు సమానమైన 64.43 కోట్ల షేర్లను కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఒక్కో షేర్‌ను 44 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామని పేర్కొంది. కాగా, నవరత్న హోదా కలిగిన ఈ ప్రభుత్వరంగ సంస్థ.. భాగస్వాముల ఆమోదాన్ని కూడా తీసుకోనుంది. ఇతరత్రా ప్రభుత్వ అనుమతులనూ పొందాల్సి ఉంది.