బిజినెస్

ద్రవ్యోల్బణం తగ్గుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 25: ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలున్న నేపథ్యంలో వ్యవసాయోత్పత్తి బాగుంటుందని, ఆహార ద్రవ్యోల్బణం అదుపులో ఉండగలదని బ్యాంక్ ఆఫ్ అమెరికా చెబుతోంది. ఆగస్టు 9న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జరిపే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లు కూడా తగ్గే వీలుందని తెలిపింది. సకాలంలో వర్షాలు కురిస్తే గ్రామీణ వినియోగ సామర్థ్యం పెరుగుతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయగలదని బుధవారం ఓ నివేదికలో ఈ అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం అభిప్రాయపడింది. ‘మా అభిప్రాయం ప్రకారం అధిక వర్షపాతం నమోదైతే వడ్డీరేట్లను తగ్గించడానికి ఆర్‌బిఐకి అవకాశాలు మెరుగవుతాయి.’ అని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో భాగంగా గత నెల ఏప్రిల్‌లో రెపో రేటును ఆర్‌బిఐ పావు శాతం తగ్గించినది తెలిసిందే.

తగ్గదు
ధరలపై వర్షాల ప్రభావం ఉండదు: నొమురా

న్యూఢిల్లీ, మే 25: ఈసారి వర్షాలు విస్తారంగా కురిసినా.. ఆహార ద్రవ్యోల్బణం మాత్రం దిగిరాదని గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం నొమురా అంటోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ).. వర్షాలు బాగా పడితే ద్రవ్యోల్బణం అదుపులో ఉండగలదని భావిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ఫలితం ఉండకపోవచ్చని అంచనా వేసింది. అసలు వర్షాలు, ఆహార ధరల ద్రవ్యోల్బణానికి మధ్య సంబంధం తక్కువని, వర్షపాతం కంటే కూడా కనీస మద్దతు ధరలు, గ్రామీణ, వ్యవసాయేతర కూలీల సంపాదన, అంతర్జాతీయంగా ఆహార ధరల తీరు ముఖ్యమని ఈ జపాన్ బ్రోకరేజ్ సంస్థ బుధవారం చెప్పింది. నిజానికి ఇప్పటికే ఆహార ధరల ద్రవ్యోల్బణం స్థిరీకరించిందని, ఇంతకంటే స్థిరత్వాన్ని ఆశించలేమని వ్యాఖ్యానించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఆహార ద్రవ్యోల్బణం సగటున 5-5.5 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నట్లు నొమురా చెప్పింది.