బిజినెస్

80 శాతం క్షీణించిన ఐఒసి లాభం (త్రైమాసిక ఆర్థిక ఫలితాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 27: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసి) నికర లాభం ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో ఏకంగా 80 శాతం క్షీణించింది. నిరుడు జనవరి-మార్చిలో 6,285.35 కోట్ల రూపాయలుగా ఉన్న సంస్థ లాభం.. ఈసారి 1,235.64 కోట్ల రూపాయలకు దిగజారింది. చమురు ధరల పతనం నేపథ్యంలో టర్నోవర్ 93,830.13 కోట్ల రూపాయల నుంచి 80,449.57 కోట్ల రూపాయలకు పడిపోయిందని శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలిపింది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2015-16) సంస్థ నికర లాభం రికార్డు స్థాయిలో 10,399.03 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఒఎన్‌జిసి (16,004 కోట్ల రూపాయల లాభం) తర్వాత అత్యధిక లాభాన్ని పొందిన ప్రభుత్వరంగ సంస్థగా ఐఒసి నిలిచింది. కాగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఐఒసి లాభం 5,273.03 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ చైర్మన్ బి అశోక్ ఇక్కడ విలేఖరులకు తెలిపారు. అయితే టర్నోవర్ మాత్రం 11.4 శాతం క్షీణించి 4,50,738 కోట్ల రూపాయలకు పరిమితమైనట్లు చెప్పారు.
బిపిసిఎల్ లాభం
రూ. 2,549 కోట్లు
ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థల్లో ఒకటైన భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (బిపిసిఎల్) నికర లాభం ఈ జనవరి-మార్చిలో 10.6 శాతం క్షీణించి 2,549.08 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 2,852.89 కోట్ల రూపాయలుగా ఉంది. అమ్మకాలు కూడా 51,346.12 కోట్ల రూపాయల నుంచి 44,197.09 కోట్ల రూపాయలకు పడిపోయాయి. ఇక మొత్తం 2015-16లో సంస్థ లాభం 7,431.88 కోట్ల రూపాయలుగా ఉంది. 2014-15లో ఇది 8,463.98 కోట్ల రూపాయలుగా ఉంది.
28 శాతం పడిపోయిన
హెచ్‌పిసిఎల్ లాభం
మరో ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పిసిఎల్) నికర లాభం ఈ మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 28 శాతం దిగజారి 1,552.94 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 2,162.39 కోట్ల రూపాయలుగా ఉంది.
పవర్‌గ్రిడ్ నికర లాభం
రూ. 1,599 కోట్లు
ప్రభుత్వరంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్ప్ స్టాండలోన్ నికర లాభం ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో 13.20 శాతం పెరిగి 1,599.05 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు ఇదే వ్యవధిలో 1,412.48 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. స్టాండలోన్ ఆదాయం ఈసారి 5,485.89 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 4,426.40 కోట్ల రూపాయలుగా ఉంది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం 6,026.72 కోట్ల రూపాయలుగా, అంతకుముందు 4,979.17 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా 17,177.23 కోట్ల రూపాయల నుంచి 20,802.22 కోట్ల రూపాయలకు పెరిగింది.
ఆర్‌ఇసి లాభం
రూ. 1,160 కోట్లు
రూరల్ ఎలక్ట్ఫ్రికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఇసి) స్టాండలోన్ నికర లాభం ఈ జనవరి-మార్చిలో 6 శాతం పెరిగి 1,160.03 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 1,096.50 కోట్ల రూపాయలుగా ఉందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు శుక్రవారం సంస్థ తెలియజేసింది. ఆదాయం ఈసారి 6,064.14 కోట్ల రూపాయలుగా, పోయినసారి 5,333.40 కోట్ల రూపాయలుగా ఉంది.