బిజినెస్

ప్రభుత్వరంగంలో పోటీతత్వ బ్యాంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 27: ప్రభుత్వరంగంలో 8-10 కాంపిటీటివ్ బ్యాంకులు రాబోతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. ప్రస్తుతం దేశంలో 27 ప్రభుత్వరంగ బ్యాంకులున్నాయన్న ఆయన ఈ బ్యాంకుల స్థిరీకరణ ముగిసిన తర్వాత అన్ని రకాలుగా 8-10 పోటీతత్వ బ్యాంకులు రావచ్చని అన్నారు. శుక్రవారం ఇక్కడ ఇండియన్ సాఫ్ట్‌వేర్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సిన్హా మాట్లాడుతూ ప్రభుత్వం ఈ దిశగా ముందుకెళ్తోందన్నారు.
గ్రిడ్‌తో 660 మెగావాట్ల
విద్యుత్ అనుసంధానం
వెల్లడించిన సెంబ్‌కార్ప్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 27: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో నెలకొల్పిన సెంబ్‌కార్ప్ గాయత్రి పవర్ లిమిటెడ్.. తొలిసారిగా 660 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేసింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ శుక్రవారం తెలిపారు. ఈ సంస్థ 1320 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. ఇందులో మొదటి దశలో 660 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. నిరుడు ఈ సంస్థ థర్మల్ పవర్ టెక్ కార్పొరేషన్‌ను నెలకొల్పగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.
8-12 శాతం రాయితీ
కాలుష్యకారక వాహనాల అప్పగింతపై
వాహనదారులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ, మే 27: పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న 11 ఏళ్ల క్రితం నాటి, దాదాపు 28 మిలియన్ల వాహనాలను స్క్రాపింగ్ కోసం అప్పగిస్తే, వాహనదారులకు కొత్తవాటి విలువలో 8-12 శాతం రాయితీని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతిపాదిత స్వచ్చంధ వాహన ఆధునీకరణ విధానంలో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు యోచిస్తోంది. అంతకుముందు కాలుష్యకారక పాత వాహనాలను వదిలించుకోవడం వల్ల ఆటో పరిశ్రమ టర్నోవర్ భారీగా పెరగనుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నది తెలిసిందే. రాబోయే ఐదేళ్లలో నూతన వాహన కొనుగోళ్లు పెరిగి ఆటోరంగ సంస్థల టర్నోవర్ నాలుగింతలు వృద్ధి చెందుతుందని, 20 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని చెప్పారు. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న స్క్రాపింగ్ పాలసీ సిద్ధమైందని, వారం రోజుల్లో దీనిపై వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించే ప్రక్రియ మొదలు పెడతామని గడ్కరీ తెలిపారు. ‘ప్రజాభిప్రాయ సేకరణార్థం వారం రోజుల్లో కాలుష్యకారక వాహన ఉపసంహరణ విధానాన్ని (స్క్రాపింగ్ పాలసీ) వెబ్‌సైట్‌లో పెడతాం. సాధారణ, వివిధ రంగాల ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతిని కోరతాం. ఆర్థిక శాఖ ఆమోదం పొందితే, కేబినెట్ ఆమోదానికి వెళ్తాం.’ అని గడ్కరీ తెలిపారు.