బిజినెస్

దేశ ఆర్థిక వ్యవస్థ సుస్థిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: అంతర్జాతీయ పరిస్థితుల్లో అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థపై శుక్రవారం జరిగిన పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత స్థూల ఆర్థిక పరిస్థితులు దేశ ఆర్థిక పురోగతికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ద్రవ్యోల్బణం అదుపు, ద్రవ్యలోటు, కరెంట్ ఖాతా లోటు ఆమోదయోగ్యంగానే ఉండటం దీనికి సాక్ష్యాలుగా ఆయన అభివర్ణించినట్లు ఓ అధికారిక ప్రకటన స్పష్టం చేసింది.