బిజినెస్

బీమాను అందరికీ అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 27: బీమా రంగాన్ని ఆధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేసి తక్కువ ఖర్చుతో, ఎక్కువ కవరేజితో పాలసీలను ప్రజలకు అందించే విధంగా కృషి చేయాలని ఇన్సురెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సిఇఒ ఆర్ రాఘవన్ బీమా రంగ నిపుణులను కోరారు. శుక్రవారం ఇక్కడ బీమా సమాచారం, రేట్‌మేకింగ్ ఫోరం ఆఫ్ ఆసియా సదస్సును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీమా పాలసీ అమ్మకం విలువను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో మెజార్టీ ప్రజలకు బీమా సదుపాయం అందుబా టులో లేదని ఆయన గుర్తు చేశారు. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల ద్వారా బీమా పాలసీల గురించి ప్రజలకు తెలియజేయాలన్నారు. దేశంలో పాలసీ కలిగి ఉన్నవారి సంఖ్య చాలా తక్కువన్నారు. బీమా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమాపై ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఉమ్మడి వ్యూహంతో కదలాలన్నారు. ఆరోగ్య బీమాను అందరికీ అందించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ఇదే కోణంలో వ్యవసాయ బీమాపైనా రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంన్నారు. బీమా సంస్థలు ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మసులుకోవాలన్నారు. కాగా, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలకు బీమాపై సమాచారాన్ని అందించడంలో గూగుల్ సర్చ్ ఇంజన్ దూసుకుపోతోందన్నారు.
మరోవైపు ఐఆర్‌డిఎఐ చైర్మన్ టిఎస్ విజయన్ ఈ సందర్భంగా దేశంలోని బీమా సంస్థలు, వాటి ప్రగతి, స్థితిగతులు, అంతర్జాతీయ బీమా మార్కెట్ ధోరణులను వివరించారు. కొరియా బీమా అభివృద్ధి సంస్థ ట్రైనింగ్ విభాగం జిఎం బైయాంగ్ మూన్, జపాన్ జనరల్ బీమా రేటింగ్ సంస్థ ఎండి కజ్నూరి ఆనాయ్, నేషనల్ డిజాస్టర్ మేనేజిమెంట్ పాలసీ, ప్లాన్ విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ వి తిరుప్పగజ్ వివిధ అంశాలపై ప్రసంగించారు.

సదస్సును ప్రారంభిస్తున్న ఐఆర్‌డిఎఐ చైర్మన్ విజయన్ తదితరులు