బిజినెస్

అత్యుత్సాహం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్/న్యూఢిల్లీ, మే 27: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ పునర్నియామకం అంశం.. పరిపాలనాపరమైనదని, ఈ విషయంలో మీడియా అత్యుత్సాహం పనికిరాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ పదవీకాలం ముగుస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలికాలంలో బిజెపి నేతలు, మంత్రులు.. రాజన్‌పై విమర్శలు గుప్పిస్తూ, ఆయన్ను మళ్లీ గవర్నర్ పదవికి తీసుకోరాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై మోదీ తొలిసారిగా స్పందిస్తూ, పైవిధంగా వ్యాఖ్యానించారు. వాల్‌స్ట్రీట్ జర్నల్‌తో మాట్లాడుతూ రాజన్ నియామకంపై స్పష్టత సెప్టెంబర్‌లో వస్తుందన్నారు. భారత జిడిపి వృద్ధిరేటుపై, దేశ ఆర్థిక పరిపుష్ఠిపై రాజన్ ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల విమర్శలకు దారి తీసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ రాజన్ వ్యాఖ్యలను తిప్పికొట్టగా, బిజెపి ఎంపి సుబ్రమణ్యన్ స్వామి.. రాజన్ ఆర్‌బిఐ గవర్నర్‌గా పనికిరారాని, ఆయన్ను మళ్లీ గవర్నర్‌గా నియమించవద్దని అన్నది తెలిసిందే.
వ్యవసాయానికి వ్యతిరేకం
బిజెపి ఎంపి సుబ్రమణ్యన్ స్వామి తాజాగా మరోసారి ఆర్‌బిఐ గవర్నర్ రాజన్‌పై విరుచుకుపడ్డారు. చిన్నతరహా పరిశ్రమలు, వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా రాజన్ విధానాలున్నాయని ఆరోపించారు. శుక్రవారం ఇక్కడ జరిగిన భారతీయ కిసాన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘బ్యాంకింగ్ విధానాలు వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా ఉన్నాయి. రాజన్ తీరును తప్పుబడుతూ నేను ప్రకటించిన ఆరు ముఖ్యాంశాల్లో ఇది కూడా ఉంది.’ అన్నారు. గురువారం ప్రధానికి రాసిన లేఖలో రాజన్‌ను తొలగించాలని, మరోసారి గవర్నర్ గిరి కట్టబెట్టరాదని స్వామి కోరినది తెలిసిందే.
రాజన్‌పై వ్యాఖ్యానించకండి
బిజెపికి చెందిన ఓ వర్గం నుంచి రఘురామ్ రాజన్‌కు తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో పారిశ్రామిక సంఘం అసోచామ్.. రాజకీయ నాయకులు రాజన్ రెండోసారి గవర్నర్ పదవిపై వ్యాఖ్యలు చేయడం తగదంది. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ తుది నిర్ణయం తీసుకుంటారని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.