బిజినెస్

‘వర్షాభావంతోనే పప్పుల ధరలకు రెక్కలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మే 29: పప్పు్ధన్యాల ధరలు పెరగడానికి కారణం.. గడచిన రెండేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, విదేశాల నుంచి పడిపోయిన పప్పు దిగుమతులేనని కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. రిటైల్ మార్కెట్‌లో పప్పు ధరలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో పాశ్వాన్ పైవిధంగా స్పందించారు. ‘పప్పు్ధన్యాల ధరలు పెరగడానికి పలు కారణాలున్నాయి. గడచిన రెండేళ్లుగా తగ్గిన వర్షపాతంతో పంటల దిగుబడి గణనీయంగా దిగజారింది. మరోవైపు దేశంలోకి విదేశాల నుంచి వచ్చే పప్పు దిగుమతులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక మార్కెట్‌లో ధరలు పెరిగాయి.’ అని లక్నోలో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ పాశ్వాన్ అన్నారు.