బిజినెస్

కోల్ ఇండియా లాభం రూ. 4,248 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక దిగ్గజం కోల్ ఇండియా లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో స్వల్పంగా పెరిగి 4,247.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) జనవరి-మార్చిలో ఇది 4,238.55 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే స్టాండలోన్ ఆధారంగా క్రిందటిసారితో చూస్తే 44.8 శాతం పెరిగి 9,629.23 కోట్ల రూపాయల నుంచి 13,950.12 కోట్ల రూపాయలకు ఎగిసింది. ఇక సంస్థ మొత్తం ఏకీకృత ఆదాయం 21,402.75 కోట్ల రూపాయలకు చేరింది. నిరుడు ఇది 21,339.55 కోట్ల రూపాయలుగా ఉంది. ఉత్పత్తి కూడా గతంతో పోల్చితే 151.86 మిలియన్ టన్నుల నుంచి 165.24 మిలియన్ టన్నులకు పెరిగింది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ ఏకీకృత నికర లాభం 3.9 శాతం వృద్ధితో 14,274.33 కోట్ల రూపాయలను తాకింది. ఆదాయం 78,010.12 కోట్ల రూపాయలుగా ఉంది.
బొగ్గు ధరల పెంపు
అదనపు ఆదాయం లక్ష్యంగా కోల్ ఇండియా బొగ్గు ధరలను పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో 3,234 కోట్ల రూపాయల మేర అదనంగా ఆదాయాన్ని అందుకోవాలని బొగ్గు ధరలను సుమారు 6.3 శాతం పెంచినట్లు ఆదివారం ప్రకటించింది. శనివారం జరిగిన సంస్థ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు వెల్లడించింది. ‘ఇప్పుడున్న ధరలను మరో 6.29 శాతం పెంచడానికి శనివారం జరిగిన సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఆమోదించారు.’ అని పేర్కొంది.
జెపి అసోసియేట్స్ నష్టం
రూ. 1,387 కోట్లు
వౌలికరంగ సంస్థ జెపి అసోసియేట్స్ స్టాండలోన్ నికర నష్టం ఈ జనవరి-మార్చిలో 1,387.3 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు జనవరి-మార్చిలో 858.07 కోట్ల రూపాయల నష్టాన్ని సంస్థ అందుకోగా, అది ఇప్పుడు మరింతగా పెరిగింది. ఆదాయం కూడా క్రిందటిసారితో చూస్తే 2,566.08 కోట్ల రూపాయల నుంచి 1,906.16 కోట్ల రూపాయలకు క్షీణించింది. ఇక మొత్తం గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో సంస్థ ఏకీకృత నష్టం 3,345 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15)లో ఈ నష్టం 1,735.1 కోట్ల రూపాయలుగానే ఉంది. ఆదాయం 19,665.81 కోట్ల రూపాయల నుంచి 17,321.26 కోట్ల రూపాయలకు పడిపోయింది.
ఉత్తమ్ గాల్వ స్టీల్స్
నష్టం రూ. 1,133 కోట్లు
మిగ్లాని కుటుంబ సారథ్యంలోగల ఉత్తమ్ గాల్వ స్టీల్ స్టాండలోన్ నికర నష్టం ఈ మార్చి 31తో ముగిసిన మూడు నెలల కాలంలో 1,133 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 9.58 కోట్ల రూపాయల లాభాన్ని సంస్థ అందుకుంది. స్టాండలోన్ ఆదాయం ఈసారి 1,729.39 కోట్ల రూపాయలుగా, పోయినసారి 2,05 4.11 కోట్ల రూపాయలుగా ఉంది.