బిజినెస్

జీడిపప్పు ధరలు పరుగో.. పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, మే 30: అసలు బంగారంతో తెల్లబంగారంగా పిలిచే జీడిపప్పు ధరలు పోటీ పడుతుండడంతో వ్యాపారులు, వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. జీడిపప్పుకు కేరాఫ్ అడ్రస్‌గా పలాసను చెప్పుకోవచ్చు. పలాస కేంద్రంగా జీడి పరిశ్రమలు ఏర్పడి 100 ఏళ్లు అవుతున్నా ఈ ఏడాదిలాంటి పరిణామాలు గతంలో ఎన్నడూ ఎదురు కాలేదని జీడి పరిశ్రమల యజమానులు అంటున్నారు. దేశీయంగా జీడి పిక్కల దిగుబడి తగ్గిపోవడంతోపాటు విదేశీ పిక్కలకు డిమాండ్ పెరగడం, డాలర్ రేటు కూడా పెరగడం.. జీడిపప్పు ధరలు పెరగడానికి కారణమని జీడి వ్యాపారులు చెబుతున్నారు. జీడిపప్పును దేశంలో కేరళ తర్వాత ఎక్కువగా ఉత్పత్తి చేసే కేంద్రం పలాస. ఉద్దానంతోపాటు పల్లపు ప్రాంతాల్లో సుమారు 10 వేల హెక్టార్లలో జీడి తోటలు నుంచి జీడి పిక్కలు లభ్యమవుతున్నాయి. జీడి రైతుల నుంచి ఏడాదికి సరిపడే జీడి పిక్కలను వ్యాపారులు కొనుగోలు చేసి నిల్వ ఉంచి ఏడాది మొత్తం జీడిపప్పు ఉత్పత్తికి ఉపయోగించేవారు. అయతే జీడిపరిశ్రమలు సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికి జీడి తోటల పెంపకం పెరగకపోవడంతో వ్యాపారులు విదేశీ పిక్కలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా దక్షిణాఫ్రికా. నైజీరియా, బెనిన్, కార్జినీయా, ఇండోనేషియా, బిస్సా, ఐవరీ కోస్టు తదితర దేశాల నుంచి జీడి పిక్కలను దిగుమతి చేసుకొని జీడిపప్పును ఉత్పత్తి చేస్తున్నారు. దేశీయంగా పండే పిక్కలు 80 కిలోల బస్తా ప్రస్తుతం మార్కెట్‌లో 11 వేల రూపాయలు పలుకుతుండగా, విదేశీ పిక్కలకు 9 వేలు నుంచి 9,500 రూపాయల వరకు ధర పలుకుతోంది. 80 కిలోల దేశీయ జీడి పిక్కల బస్తా నుంచి 20 నుంచి 22 కిలోల వరకు జీడిపప్పు లభిస్తే, విదేశీ పిక్కల నుంచి 16 నుంచి 18 కిలోలు మాత్రమే జీడిపప్పు ఉత్పత్తి అవుతుంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తెల్లబంగారంగా పిలవబడే కిలో జీడి పిక్కలు మొదటి రకం (180) 640 రూపాయలు, రెండో రకం (210) 620 రూపాయలు, మూడో రకం (32) 600 రూపాయలు, జెహెచ్ (బద్ద) 600 రూపాయలు, జీడిబద్ద ముక్క 540 రూపాయలు, జీడినూక పెద్దసైజు 420 రూపాయలు పలుకుతోంది. ఉగాదికి జీడిపరిశ్రమల యజమానులు తమ ఉత్పత్తులను పూర్తిచేసి నూతన వ్యాపారానికి శ్రీకా రం చుట్టే సమయంలో మొదటి రకం జీడిపప్పు 700 నుంచి 720 రూపాయలు పలుకగా, నేడు పరిశ్రమలు తెరుచుకోవడంతో ధరలు కొంతమేరకు తగ్గి వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు.