బిజినెస్

స్టార్టప్‌లకు ట్యాక్స్ హాలిడే పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు స్టార్టప్‌లకు ప్రస్తుతమిస్తున్న మూడేళ్ల ట్యాక్స్ హాలిడేను ఏడేళ్లకు పెంచాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నా రు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తప్పక ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సోమవారం ఇక్కడ తన మంత్రిత్వ శాఖ గడచిన రెండేళ్లలో సాధించిన విజయాలను ఆమె విలేఖరులకు వెల్లడించారు. ఈ సందర్భంగానే ఆమె మాట్లాడుతూ అంకుర సంస్థల (స్టార్టప్)కు ప్రస్తుతం ఇస్తున్న పన్ను మినహాయింపు కాలవ్యవధిని మరో నాలుగేళ్లు పెంచి మూడేళ్ల నుంచి ఏడేళ్లకు చేర్చాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సులు చేసినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా వివిధ అంకుర సంస్థలను తాను పరిశీలించానని, వాటికి ఆర్థిక చేయూత మరింతగా అవసరమని అన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై మాట్లాడుతూ జూన్ 2014 నుంచి జనవరి 2016 వరకు 53 శాతం వృద్ధితో 60.04 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ దేశంలోకి వచ్చిందన్నారు. అంతకుముందు 20 నెలల్లో ఇది 39.19 బిలియన్ డాలర్లుగానే ఉందని గుర్తుచేశారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో మునుపెన్నడూ లేనివిధంగా గరిష్ఠ స్థాయిలో 51 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ భారత్‌కు వచ్చిందని చెప్పారు. కేసుల పరిష్కారంలోనూ, సందేహాల నివృత్తిలోనూ త్వరగా స్పందించామన్నారు. ఇదిలావుంటే యాపిల్‌కు లోకల్ సోర్సింగ్ వైవర్‌పై ఆర్థిక శాఖను ఒత్తిడి వాణిజ్య శాఖ ఒత్తిడి చేస్తోంది. లోకల్ సోర్సింగ్ వైవర్ తిరస్కరణ అంశాన్ని పునరాలోచించాలని కోరినట్లు మంత్రి తెలిపారు.