బిజినెస్

టెలికామ్ షేర్ల మద్దతుతో.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 1: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మంగళవారం నష్టాలపాలైన నేపథ్యంలో టెలికామ్, ఎఫ్‌ఎమ్‌సిజి, ఐటి, టెక్నాలజీ, రియల్టీ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సూచీలు తిరిగి కోలుకోగలిగాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 45.97 పాయింట్లు పుంజుకుని 26,713.93 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.85 పాయింట్లు అందిపుచ్చుకుని 8,179.95 వద్ద నిలిచింది. నిజానికి ఉదయం ఆరంభంలో జిడిపి, వౌలికరంగ గణాంకాల వృద్ధితో సూచీలు లాభాల్లోనే కదలాడినప్పటికీ, తర్వాత తయారీరంగ వృద్ధి ఐదు నెలల కనిష్టానికి పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. అయితే మళ్లీ మదుపరులు పెట్టుబడులపట్ల ఆసక్తి కనబరచడంతో స్వల్ప లాభాలతోనైనా సూచీలు గట్టెక్కగలిగాయి. టెలికామ్ షేర్లు అత్యధికంగా 2.83 శాతం లాభపడితే, ఎఫ్‌ఎమ్‌సిజి, టెక్నాలజీ, ఐటి, రియల్టీ రంగాల షేర్ల విలువ 1.60 శాతం నుంచి 0.37 శాతం వరకు పెరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాల షేర్ల విలువ 1.19 నుంచి 0.60 శాతం వరకు క్షీణించింది.