బిజినెస్

టీవీతో దోమలు పరార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 7: దక్షిణ కొరియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్‌జి.. మంగళవారం ఓ సరికొత్త ‘మస్కిటో అవే టీవీ’ని దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. దీని ధరల శ్రేణి 26,900 రూపాయల నుంచి 47,500 రూపాయల మధ్య ఉంది. ‘ఈ ఎల్‌జి మస్కిటో అవే టీవీ భారతీయ వినియోగదారులకు చక్కగా సరిపోతుంది. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన ఈ టెలివిజన్‌లో ఓ అల్ట్రా సోనిక్ డివైస్‌ను అమర్చాం. ఇది ఒక్కసారి యాక్టివేట్ అయ్యిందంటే, దీన్నుంచి వచ్చే ధ్వని తరంగాల సాంకేతికతతో దోమలు దూరంగా పోతాయి. ఈ తరంగాల వల్ల మనుషులకు ఎటువంటి హానీ ఉండదు.’ అని ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ సంస్థల నిబంధనలను అనుసరించి ఈ టెలివిజన్‌ను తయారుచేశామని, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ టాక్సికాలజీ (ఐఐబిఎటి) ద్వారా పరీక్షించామని ఎల్‌జి చెప్పింది.
ఇక భారత్‌లో పురుగులు, క్రిమికీటకాల బెడద ఎక్కువని, ముఖ్యంగా రాత్రిళ్లు టీవి చూస్తున్నప్పుడు వీటి ద్వారా కలిగే ఆటంకం అంతా ఇంతా కాదని ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్-హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ హోవర్డ్ లీ అన్నారు. అందుకే వినియోగదారులకు ఈ రకమైన అసౌకర్యాలుండకుండా ఎల్‌జి తగిన ఉత్పత్తులను తయారు చేస్తోందన్నారు. ఇక ఎంపిక చేసిన ఎల్‌జి బ్రాండ్ స్టోర్లలో మాత్రమే ఈ టీవీలు అందుబాటులో ఉంటాయని సంస్థ స్పష్టం చేసింది. 80 సెంటీమీటర్ల నుంచి 108 సెంటీమీటర్ల వరకు వివిధ సైజుల్లో ఇవి అందుబాటులో ఉంటాయని వివరించింది.