బిజినెస్

తగ్గిన జిడిపి అంచనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) జిడిపి వృద్ధిరేటు అంచనాను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. 8.1-8.5 శాతం నుంచి 7-7.5 శాతానికి తీసుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఆర్థిక సర్వేలో ఈసారి జిడిపి 8.1-8.5 శాతంగా నమోదవుతుందని అంచనా వేసిన విషయం తెలిసిందే. అయితే దేశ ఆర్థిక వ్యవస్థపై కొన్ని ప్రతికూల పరిస్థితుల ప్రభావం పడుతోందని, ఇవి జిడిపి పురోగతికి సవాల్ విసురుతున్నాయని మోదీ సర్కారు తెలిపింది. శుక్రవారం పార్లమెంట్‌కు అర్ధ వార్షిక ఆర్థిక విశే్లషణను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించింది. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాన్ని సాధిస్తామన్న ఆర్థిక శాఖ.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17)లో మాత్రం ఈ లక్ష్యంపై కొంత ఒత్తిడి నెలకొనవచ్చని అభిప్రాయపడింది. 7వ వేతన సంఘం ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలను పెంచాలంటూ చేసిన సిఫార్సే ఇందుకు కారణంగా పేర్కొంది. ప్రతికూల పరిస్థితుల మధ్య ఇంతకుముందు వేసిన అంచనా కంటే ఒక శాతం జిడిపి వృద్ధిరేటు అంచనాను తగ్గించాల్సి వచ్చిందని తెలిపింది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రిటైల్ ద్రవ్యోల్బణం అదుపునకు సంబంధించి పెట్టుకున్న లక్ష్యం నెరవేరుతుందని దాదాపు 6 శాతం వద్దే ఉంటుందని విశే్లషణలో చెప్పింది.
ఆర్థిక వ్యవస్థలో మిశ్రమ సంకేతాలు
దేశ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ సంకేతాలనిస్తోందని ఆర్థిక ముఖ్య సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ అన్నారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వ వ్యయం పెరుగుతుండటం, ఆదాయంలో ఆశించిన స్థాయిలో వృద్ధి లేకపోవడం, విదేశీ పెట్టుబడులు తగ్గడం వంటివి మున్ముందు భారతీయ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయన్నారు.
అంతర్జాతీయ స్థాయికి రూపాయి
ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయికి ఆదరణ లభించేలా చర్యలు చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ‘రూపాయికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.’ అని లోక్‌సభలో ఓ లిఖితపూర్వక సమాధానంగా సిన్హా చెప్పారు. అంతర్జాతీయ లావాదేవీల్లో రూపాయి చలామణీకి అవరోధాలు ఏర్పడుతున్నాయన్న ఆయన వాటిని తొలగించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.
పప్పు్ధన్యాల ఉత్పత్తి పురోగతికి వ్యూహం
పప్పు్ధన్యాల ఉత్పత్తి పడిపోవడంతో మార్కెట్‌లో వాటి ధరలు రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే. దేశీయంగా డిమాండ్‌ను అందుకునేందుకు విదేశాల నుంచి దిగుమతి కూడా చేసుకుంటున్నాం. ఈ క్రమంలో పప్పు్ధన్యాల ఉత్పత్తి పెరిగేలా ‘దిగుబడి, బీమా, ధర (వైఐపి)’ అనే మూడంచెల వ్యూహంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు అర్ధ వార్షిక ఆర్థిక విశే్లషణలో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.