బిజినెస్

కీలక వడ్డీరేట్లు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 7: ద్రవ్యోల్బణం పెరిగిన నేపథ్యంలో కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లలేదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్. మంగళవారం ఇక్కడ ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను ఆర్‌బిఐ నిర్వహించింది. ఈ క్రమంలో రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచిన సెంట్రల్ బ్యాంక్.. నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్)ని కూడా ఉన్నచోటే ఉంచింది. దీంతో రెపో రేటు 6.50 శాతం వద్దే, రివర్స్ రెపో రేటు 6 శాతం వద్దే ఉన్నాయి. సిఆర్‌ఆర్ కూడా 4 శాతం వద్దే అలాగే ఉంది. కాగా, ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు బలంగా ఉన్న నేపథ్యంలో అదే జరిగి ద్రవ్యోల్బణం దిగివస్తే వడ్డీరేట్ల కోతలుంటాయని ద్రవ్యసమీక్ష అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాజన్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా ఉంటుందన్న రాజన్.. వచ్చే ఏడాది జనవరికల్లా ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి తీసుకురావడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల కదలికలను గమనిస్తున్నామన్న ఆయన 7వ వేతన సంఘం సిఫార్సుల అమలునూ పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష ఆగస్టు 9న జరగనుంది. మరోవైపు సిఐఐ తదితర పారిశ్రామిక సంఘాలు వడ్డీరేట్లు తగ్గిస్తే వృద్ధిరేటుకు దోహదపడినట్లు అయ్యేదని పేర్కొన్నారు. పెట్టుబడులకు ఊతమిచ్చేదన్నారు.
నేను చెప్పేదేం లేదు
ఇదిలావుంటే ఆర్‌బిఐ గవర్నర్‌గా తన పదవీకాలం పొడిగింపుపై మీడియాలో కొనసాగుతున్న ఊహాగానాలపై రాజన్ స్పందిస్తూ మీడియాలో వస్తున్న ఊహాగానాలను పాడు చేయదలుచుకోలేదన్నారు. అక్టోబర్‌లో జరిగే ద్రవ్యసమీక్షలో మీరుంటారా? అని విలేఖరులు ప్రశ్నించినప్పుడు రాజన్ పైవిధంగా స్పందించారు. మూడేళ్ల పదవీకాలం ముగిసిన క్రమంలో సెప్టెంబర్ 4 తర్వాత తాను పదవీలో కొనసాగుతానా? లేదా అన్నది ప్రభుత్వం తన మధ్య జరిగే చర్చల పిదప తేలుతుందన్నారు.
chitram...
విలేఖరులతో మాట్లాడుతున్న ఆర్‌బిఐ గవర్నర్ రాజన్