బిజినెస్

ఆర్‌డిడి కార్యాలయాల తొలగింపునకు రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పరిపాలనా పరమైన సంస్కరణలపై దృష్టి సారించారు. అందులో భాగంగా రెండు, మూడు జిల్లాలకు చెందిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (ఆర్‌డిడి), రీజనల్ డైరెక్టర్ కార్యాలయాలను తొలగించి వాటిని రాష్ట్ర కార్యాలయాలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇకపై రాష్టవ్య్రాప్తంగా కార్యాలయాలన్నీ జిల్లా అధికారుల పరిధిలోకి రానున్నాయి.
మూడు జిల్లాలు, రెండు జిల్లాల కార్యాలయాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను జిల్లా కార్యాలయాల్లోకి తీసుకుని పరిపాలన సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం. నవ్యాంధ్ర రాష్ట్రంలో ఉద్యోగుల కొరత ఎక్కువగానే ఉంది. దీంతో రెండు, మూడు జిల్లాల అధికారులను జిల్లాల నుండి తొలగించి వారిని రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు బదిలీచేస్తే అక్కడ కూడా సిబ్బంది కొరత ఉండదు. దీంతో ప్రభుత్వ ఉన్నతాధికారులు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏయే కార్యాలయాలు ఉన్నాయి, ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారన్న చర్చలో నిమగ్నమైనట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఈ విధానం ద్వారా పరిపాలన సజావుగా సాగుతుందో లేదోనన్న అనుమానాలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి. రెండు, మూడు జిల్లాల అధికారులు ఉంటే పరిపాలన మొత్తం వారి చేతుల్లో ఉండే అవకాశం ఉంది. దీంతో వెంటనే అభివృద్ధి పనులు కాని, ఉద్యోగుల బదిలీలు కాని వారి ఆధీనంలో జరుగుతూ ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఇకపై ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నడవాల్సి ఉంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా స్ర్తి, శిశు సంక్షేమ, విద్య, సమాచార, వైద్య ఆరోగ్య, ఆయుష్ తదితర శాఖలకు చెందిన కార్యాలయాలు మూడు లేదా రెండు జిల్లాలకు ఒక్కొక్కటి ఉన్నాయి. ఇకపై ఆయా కార్యాలయాల్లో ఆర్‌డిడిలు, ఆర్‌జెడి పోస్టులు కనిపించని పరిస్థితి నెలకొంది. మొత్తంమీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వలన ఉద్యోగులు రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాల కోసం ఎదురు తెన్నులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కొంత మందిని తొలగించింది. గృహనిర్మాణ శాఖలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోపాటు, మరికొన్ని శాఖలకు చెందిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం తొలగించటంతో వారందరు రోడ్డున పడ్డారు. తమను విధుల్లోకి తీసుకోవాలని తొలగించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అయనప్పటికీ వారికి మాత్రం ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇవ్వలేదు. అయతే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీసుకునే ఈ నిర్ణయం వలన ఆర్‌డిడి, ఆర్‌జెడి కార్యాలయాల్లోని సిబ్బందిని ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. దీంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయ.
కాగా, ప్రభుత్వ యోచనతో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలతో మూడు, రెండు జిల్లాలకు చెందిన అధికారుల్లో గుబులు మొదలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మూడు జిల్లాల ఆర్‌డిడి పోస్టులను రద్దుచేసి వారి సేవలను రాష్ట్ర ప్రధాన కార్యాలయాల్లో వినియోగించుకునే విధంగా జీవో కూడా జారీచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ జీవోను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.