బిజినెస్

రుణాత్మకంలోకి పారిశ్రామికోత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 10: తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల పేలవ ప్రదర్శనతో ప్రారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) ఈ ఏప్రిల్ నెలలో మైనస్‌లోకి పడిపోయింది. -0.8 శాతంగా నమోదైందని కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. నిరుడు ఏప్రిల్‌లో 3 శాతం వృద్ధిని కనబరిచిన ఐఐపి.. ఈసారి మాత్రం నిరాశపరిచింది. కాగా, ఈ మూడు నెలల్లో ఇది తొలి క్షీణతవగా, ఫిబ్రవరిలో దాదాపు 2 శాతం వృద్ధిని కనబరిచింది. మార్చిలో వృద్ధిరేటు బాగా పతనమైనప్పటికీ 0.3 శాతం పెరుగుదలనే కనబరిచింది. అయితే ఏప్రిల్‌లో మాత్రం మైనస్‌లోకి జారుకుంది. దీనికి కారణం ఐఐపిలో 75 వాటాను ఆక్రమించిన తయారీ రంగ వృద్ధిరేటు దిగజారడమేనని తాజా గణాంకాలతో స్పష్టమవుతోంది. తయారీరంగ ఉత్పత్తి మైనస్ 3.1 శాతానికి పడిపోయింది. నిరుడు ఇది 3.9 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఉత్పత్తి అయితే ఏకంగా 24.9 శాతం పడిపోయింది. నిరుడు 5.5 శాతం ఎగిసింది. అయితే కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగంలో ఉత్పత్తి నిరుడుతో పోల్చితే 1.3 శాతం నుంచి 11.8 శాతానికి పెరిగింది. విద్యుదుత్పత్తి కూడా -0.5 శాతం నుంచి 14.6 శాతానికి, గనుల రంగం -0.6 శాతం నుంచి 1.4 శాతానికి వృద్ధి చెందాయి. కాగా, కన్జ్యూమర్ గూడ్స్ ఉత్పత్తి అంతకుముందు 2.8 శాతం పెరిగితే, ఈసారి 1.2 శాతానికి తగ్గింది. కన్జ్యూమ నాన్-డ్యూరబుల్ ఉత్పత్తి సైతం క్రిందటిసారితో పోల్చితే 3.7 శాతం వృద్ధి నుంచి -9.7 శాతానికి క్షీణించింది. మొత్తంగా గమనిస్తే తయారీ రంగంలోని 22 పరిశ్రమల్లో 9 పరిశ్రమలు ఈ ఏప్రిల్‌లో వృద్ధిపరంగా మైనస్‌లోకి వెళ్లాయి.
పారిశ్రామిక రంగం ఆందోళన
ఐఐపి తాజా గణాంకాల నేపథ్యంలో పారిశ్రామిక రంగం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పారిశ్రామిక పురోగతి పెద్ద సవాల్‌గా పరిణమించిందని పేర్కొంది. డిమాండ్-సరఫరా మధ్య నెలకొన్న భారీ వ్యత్యాసం వల్లే ఇదంతా అని, క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి పెద్ద ఎత్తున పతనం కావడం ప్రమాదకరమని అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ అభిప్రాయపడ్డారు. మరోవైపు కీలకమైన తయారీ రంగంలో వృద్ధి పుంజుకోవాలంటే మరికొంత సమయం పడుతుందని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా అన్నారు. ఐసిఆర్‌ఎ సీనియర్ ఆర్థికవేత్త అదితి నాయర్ మాట్లాడుతూ పారిశ్రామికోత్పత్తి ఏప్రిల్‌లో -0.8 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించేదేనని అన్నారు. అయితే మున్ముందు రోజుల్లో ఐఐపి గణాంకాలు పెరగవచ్చన్న అభిప్రాయాన్ని కేర్ రేటింగ్స్ వెలిబుచ్చింది. ఇకపోతే ఐఐపి తాజా గణాంకాల నేపథ్యంలో వచ్చే ద్రవ్యసమీక్షలోనైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
ఈ నెలలో జరిపిన ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఆర్‌బిఐ వడ్డీరేట్ల జోలికి వెళ్లనిది తెలిసిందే. వర్షాలు పడి ద్రవ్యోల్బణం దిగివస్తేనే రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను తగ్గిస్తామని గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. అయితే ఐఐపి పతనం దృష్ట్యా ఆగస్టులో జరిపే ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు (2016-17) తృతీయ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును తగ్గించాలని పారిశ్రామిక రంగం కోరుతోంది.