బిజినెస్

పేదరికం పోవాలంటే కోళ్లు పెంచుకోండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 10: అన్ని విధాలుగా సులువైన కోళ్లను పెంచడం, వాటి ఉత్పత్తుల్ని విక్రయించడం ద్వారానే పేదరికం పోతుంది తప్ప కంప్యూటర్లు, ఇంటర్‌నెట్‌తో కాదని మైక్రోసాఫ్ట్ అధినేత. ప్రపంచ శ్రీమంతుల్లో ఒకరైన బిల్ గేట్స్ అన్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలకు కోళ్ల పెంపకం వల్ల ఆర్థిక సాధికారికత లభిస్తుందని, తమ కాళ్లపై తాము నిలబడే అవకాశం ఉంటుందని చెప్పారు. రోజుకు రెండు డాలర్ల ఆదాయం కూడా లేని సబ్ సహారాలోని పేద కుటుంబాలకు లక్ష కోళ్లను పంపిణీ చేసేందుకు హీఫర్ ఇంటర్నేషనల్‌తో గేట్స్ ఒప్పందం కుదుర్చుకున్నారు. టీకాలు వేసిన కోళ్లను 30 శాతానికిపైగా గ్రామీణ కుటుంబాలు పెంచుకునేలా చేయాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఏ ఇతర మార్గాల్లోనూ లభించనంత తేలికపాటి ఆదాయం కోళ్లు, వాటి ఉత్పత్తుల వల్ల లభిస్తుందని, వేగంగా సంపాదించుకునేందుకూ ఆస్కారం ఉంటుందని బిల్ గేట్స్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆదాయం పెరగడమే కాకుండా కోళ్లను పెంచే కుటుంబాల్లో పౌష్టిక విలువలూ పెరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కోళ్లు, వాటి ఉత్పత్తుల్ని విక్రయించే మహిళలు ఆ లాభాలను తమ కుటుంబ అభివృద్ధికి వినియోగించుకునేందుకూ అవకాశం ఉంటుందన్నారు.