బిజినెస్

నష్టాన్ని భర్తీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూన్ 14: దేశంలో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అమలులోకి తీసుకురావాలన్న ప్రతిపాదనకు దాదాపు అన్ని రాష్ట్రాలు మద్దతు తెలిపాయని, అయితే తమిళనాడు మాత్రం దీనిపై ‘కొన్ని అభ్యంతరాలను’ వ్యక్తం చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీర్ఘ కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న జిఎస్‌టిపై మంగళవారం కోల్‌కతాలో ఆయన సాధికార కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ఈ సమావేశం ముగిసిన తర్వాత జైట్లీ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్రాల పన్నులను సమ్మిళితం చేయాలన్న లక్ష్యంతో తీసుకొస్తున్న వస్తు, సేవల పన్ను అమలుకు నిర్ధిష్టమైన గడువేమీ లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి జిఎస్‌టిని అమలులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు లక్ష్యంగా నిర్ధేశించుకున్నప్పటికీ ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడంతో అది రాజ్యసభలో చిక్కుకుపోయిన విషయం విదితమే.
అయితే వస్తు, సేవల పన్నును అమలులోకి తీసుకురావాలన్న ప్రతిపాదనకు రెండు రోజులు జరుగుతున్న సాధికార కమిటీ సమావేశంలో మంగళవారం దాదాపు అన్ని రాష్ట్రాలు మద్దతు తెలిపాయని, అయితే దీనిపై తమిళనాడు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో వాటిని కమిటీ నోట్ చేసుకుందని తొలి రోజు సమావేశం ముగిసిన అనంతరం అరుణ్ జైట్లీ విలేఖర్లకు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ ముఖ్యమంత్రులు, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, మరో ఏడు రాష్ట్రాల సీనియర్ అధికారులు సహా 22 రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాధికార కమిటీ సమావేశానికి ఇంత ఎక్కువ మంది హాజరు కావడం రికార్డని, ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు వస్తు, సేవల పన్నుపై తమ అభిప్రాయాలను సమగ్రంగా వివరించాయని జైట్లీ చెప్పారు.
లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న జిఎస్‌టి బిల్లును తొలుత మనం ఆమోదిస్తే ఆ తర్వాత రాష్ట్రాలు దీనిని ఆమోదిస్తాయని, అనంతరం కేంద్ర వస్తు, సేవల పన్ను (సిజిఎస్‌టి) బిల్లును పార్లమెంట్, రాష్ట్ర వస్తు, సేవల పన్ను (ఎస్‌జిఎస్‌టి) బిల్లును రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుందని జైట్లీ వివరించారు. జిఎస్‌టి అమల్లోకి వస్తే తొలి ఐదేళ్లు ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని రాష్ట్రాలు భయపడుతున్నాయని, అయితే ఆ నష్టాన్ని కేంద్రం భర్తీ చేస్తుందని జైట్లీ పేర్కొంటూ, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.
chitram...
జిఎస్‌టిపై తొలి రోజు సాధికార కమిటీ సమావేశం ముగిశాక విలేఖరులతో మాట్లాడుతున్న కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ