బిజినెస్

ఓర్వకల్లులో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 18: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామ సమీపంలో విద్యాసంస్థల సముదాయానికి కేటాయించిన 900 ఎకరాల భూమిలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు నెలకొల్పడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎడ్యుకేషనల్ హబ్ పేర ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 120 ఎకరాలు కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన విషయం విదితమే. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేయడంతో మార్గం సుగమమైంది. ఈ తీర్మానాన్ని బిల్లు రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా తీసుకువస్తారని అధికారులు పేర్కొంటున్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే శాసనసభ, మండలిలో ప్రవేశపెడతామని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పటికే స్పష్టం చేశారు. వీటిలో ప్రతిభకే పెద్దపీట వేస్తారని, ప్రతిభతో ఆయా విశ్వవిద్యాలయాల్లో సీటు పొందిన విద్యార్థులకు ప్రభుత్వమే ఫీజులు భరిస్తుందని తెలిపారు. ఈ బిల్లుకు ఉభయసభల ఆమోదం తెలిపిన అనంతరం రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలను నెలకొల్పడానికి ఆసక్తి చూపుతున్న సుమారు 35 విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఎంపిక చేసిన 35 విశ్వవిద్యాలయాల్లో 15 ప్రపంచంలోనే పేరెన్నికగన్నవి కాగా, 20 విశ్వవిద్యాలయాలు దేశంలో పేరొందినవని స్పష్టమవుతోంది. వీటిలో ఒక ప్రపంచ స్థాయి, రెండు జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలను ఓర్వకల్లులో నెలకొల్పేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందని అధికారుల ద్వారా తెలుస్తోంది. ఒక్కో విశ్వవిద్యాలయానికి వాటి స్థాయిని బట్టి 30 నుంచి 50 ఎకరాల భూమి కేటాయించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. విశ్వవిద్యాలయాలు అందించే కోర్సులను బట్టి అవసరమైతే మరి కొంత భూమి ఇవ్వడానికి ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవచ్చని వారంటున్నారు. ఈ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. అయితే ఫీజుల విషయంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడే అవకాశముందని, కాబట్టి ప్రభుత్వం, బ్యాం కుల సహకారంతో విద్య పూర్తి చేసేందుకు వీలుంటుందని వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం భూ కేటాయింపులను జనవరికి పూర్తి చేయగలిగితే రానున్న విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించడానికి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సిద్ధపడతాయని భావిస్తున్నారు.