బిజినెస్

ఎగుమతుల పురోగతికి ప్రోత్సాహకాలు అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: దేశీయ ఎగుమతులు మందగమనంలో సాగుతున్న వేళ మే నెలలో మళ్లీ పుంజుకున్న సంకేతాలు వ్యక్తమయ్యాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో విదేశాలకు భారత ఎగుమతులు మరింతగా పెరిగేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.
‘ఇక భారత ఎగుమతులు స్థిరంగా వృద్ధి చెందుతాయని నేను అనుకుంటున్నాను. అంతకుముందుతో పోల్చితే మే నెలలో 0.79 శాతం మాత్రమే క్షీణత నమోదైంది. 2014 డిసెంబర్ నుంచి గమనిస్తే నెలవారీగా ఎగుమతులు తగ్గింది ఇదే స్వల్పం. ఇంజినీరింగ్, రత్నాలు, ఆభరణాలు పలు చమురేతర రంగాల ఎగుమతులు కోలుకున్నాయి.’ అని శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు.
ఆయా రంగాలవారీగా ఎగుమతులను ప్రోత్సహించడానికి ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తామని, ఆ దిశగా చర్యలు చేపడతామన్నారు. కాగా, వరుసగా దేశీయ ఎగుమతులు పతనమవుతున్నది తెలిసిందే. మే నెలలో ఎగుమతుల క్షీణత మోతాదు తగ్గినప్పటికీ.. వృద్ధి నమోదు కాకపోవడం ఇది 18వసారి కావడం గమనార్హం.
నిరుడుతో పోల్చితే ఈ మే నెలలో ఎగుమతులు 0.79 శాతం పడిపోయి 22.17 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు కూడా 13.16 శాతం తగ్గి 28.44 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో వాణిజ్య లోటు 6.27 బిలియన్ డాలర్లుగా ఉంది. నిరుడు ఇది 10.4 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇకపోతే ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో భారత ఎగుమతులు 3.74 శాతం దిగజారి 42.73 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత నెల బంగారం దిగుమతులు 39 శాతం తగ్గి 1.47 బిలియన్ డాలర్లుగా నిలిచాయి.