బిజినెస్

దిగివస్తున్న టమోటా ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: టమోటా ధరలు దిగివస్తున్నాయి. నిన్న, మొన్నటిదాకా రిటైల్ (చిల్లర) మార్కెట్‌లో కిలో 100 రూపాయల వరకు పలికిన టమోటా ధర.. నేడు సగానికిపైగా తగ్గుముఖం పట్టింది. టోకు (హోల్‌సేల్) మార్కెట్‌లో ధరలు శాంతిస్తుండటంతో దానికి అనుగుణంగా రిటైల్ మార్కెట్‌లోనూ ధరలు క్రిందికొస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం అజద్‌పూర్ హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో 60 రూపాయలు తాకిన టమోటా ధర.. ప్రస్తుతం 20-40 రూపాయలు పలికింది. ఆయా ప్రాంతాలనుబట్టి రిటైల్ మార్కెట్ ధరలు కూడా 50-80 రూపాయలకు తగ్గాయి. ‘నిజానికి ఇది టమోటాకు కొరత కాలం. అందుకే ధరల్లో ఈ మార్పు. అయినా ఇదంతా తాత్కాలికమే. త్వరలోనే ధరలు అదుపులోకి వస్తాయి.’ అని వ్యవసాయ శాఖ కార్యదర్శి శోభన కె పట్నాయక్ పిటిఐకి తెలిపారు. ఇదిలావుంటే హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌ల నుంచి 350 టన్నులకుపైగా టమోటాలు ఢిల్లీ మార్కెట్లకు చేరడంతో పరిస్థితి సాధారణ స్థాయికి చేరుకుంటోందని టమోటా వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అశోక్ కౌశిక్ అన్నారు. గత 15 రోజులకుపైగా హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో టమోటా ధరలు ఆకాశాన్ని తాకగా, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల్లో కిలో 80-100 రూపాయలు పలికినది తెలిసిందే. మరోవైపు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లోని బోయన్‌పల్లి మార్కెట్‌కు 40 వేల క్వింటాళ్ల టమోటా వచ్చింది. నిరుడు జూన్‌లో 18 వేల క్వింటాళ్లే రాగా, ఈసారి మాత్రం రెట్టింపయ్యంది. దీనికి ధరల్లో చోటుచేసుకున్న అసాధారణ మార్పే కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయ.

మోదీ హయాంలో
ధరలు పరుగో.. పరుగు
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయంది. అయతే ఈ రెండేళ్లలో వివిధ రకాల ఆహారోత్పత్తుల ధరలు ఏ స్థాయలో పెరిగాయో తెలిపే పట్టిక ఇది. అధికారం చేపట్టినప్పుడున్న ధరలు, ఇప్పుడున్న ధరలను చూస్తే అన్ని ప్రధాన ఆహార పదార్థాల ధరలు పెరిగిన సంకేతాలే కనిపిస్తున్నాయ. ముఖ్యంగా పప్పుల ధరలు అధికంగా పెరిగాయని తేటతెల్లమవుతోంది. మార్కెట్‌లో అధిక డిమాండ్ కలిగిన, ప్రస్తుతం అందరు వినియోగిస్తున్న సన్‌ఫ్లవర్ (ప్రొద్దుతిరుగుడు పువ్వు) నూనె ధర సైతం భారీగా పెరిగింది. గత రెండేళ్లలో 66 రూపాయలు ఎగబాకింది.