బిజినెస్

స్పైస్‌జెట్ టిక్కెట్‌తో టాక్సీ బుకింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 19: ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్.. తమ ప్రయాణికులకు త్వరలో విమానాశ్రయానికి సకాలంలో చేరుకోవడంలో భాగంగా విమాన టిక్కెట్‌తో టాక్సీ బుకింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తేనుంది. టిక్కెట్ కొనుగోలు సమయంలో టాక్సీని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కాగా, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని కూడా సంస్థ భావిస్తోంది. దేశవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో స్పైస్‌జెట్ విమాన సేవలను అందిస్తోంది.