బిజినెస్

రాజన్ విధానాలు శ్రీరామరక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ముంబయి, జూన్ 19: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా రెండోసారి ఉండలేనని రఘురామ్ రాజన్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన చేపట్టిన నిర్మాణాత్మక మార్పులను దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాల దృష్ట్యా ఇకపైనా అవలంభించాల్సిన అవసరం ఉందని భారతీయ పారిశ్రామిక రంగం అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల మధ్య భారత ఆర్థిక సుస్థిరతకు ముప్పు వాటిల్లే వీలుందని, కాబట్టి ఆ ప్రమాద నివారణకు రాజన్ గతంలో తీసుకున్న పలు నిర్ణయాలను మున్ముందు కూడా ఆచరిస్తే మంచిదని అసోచామ్, ఫిక్కీ వంటి పారిశ్రామిక సంఘాలు సూచిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు రాజన్ అందించిన సేవలు ప్రశంసనీయమని, ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఫిక్కీ కొనియాడింది.
కాగా, రాజన్ వారసుడిని ప్రభుత్వం త్వరలోనే గుర్తించగలదని, ఆ వచ్చేవారు కూడా రాజన్ మాదిరిగానే వృద్ధికారక నిర్ణయాలు తీసుకోగలరన్న ఆశాభావాన్ని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా వ్యక్తం చేశారు. అయితే రాజన్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలన్న ఆకాంక్షను అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్ వెలిబుచ్చారు.
రాజన్ నిర్ణయం వ్యక్తిగతం
ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్.. రెండోసారి తన పదవిలో కొనసాగలేనని చెప్పడం ఆయన వ్యక్తిగతమని, దాన్ని తప్పక మనమంతా గౌరవించాలని ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్ ఎండి, సిఇఒ చందా కొచ్చర్ అన్నారు. ‘తిరిగి అధ్యాపక వృత్తిలోకే వెళ్లిపోవాలన్నది రాజన్ వ్యక్తిగతం. ఆ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి.’ అని ఆదివారం ఇక్కడ అన్నారు. మరోసారి ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉండటం ఇష్టం లేదని శనివారం రాజన్ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసినది తెలిసిందే.
ఐదేళ్ల పదవీకాలం ఉండాలి
రఘురామ్ రాజన్ సెకండ్ ఇన్నింగ్స్‌కు అంగీకరించని నేపథ్యంలో అసలు ఆర్‌బిఐ గవర్నర్ పదవీకాలం ఐదేళ్లపాటు ఉండాలని ఆర్‌బిఐ మాజీ డిప్యూటి గవర్నర్ రాకేశ్ మోహన్ అన్నారు. అత్యున్నత బ్యాంక్ అధిపతి హోదా కేవలం మూడేళ్లకే పరిమితం కావడం సరికాదన్నారు. సంస్కరణలు సరైన రీతిలో అమలు కావాలంటే కనీసం ఐదేళ్లు పడుతుందని, కాబట్టి ఆర్‌బిఐ గవర్నర్ పదవీకాలం ఐదేళ్లుండాల్సిన అవసరం ఉందన్నారు.
శుభ శకునం కాదు
ఆర్‌బిఐ గవర్నర్ పదవిని రాజన్ వీడటం.. భారత ఆర్థిక వ్యవస్థకు శుభ శకునం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ ఆర్థికవేత్తలు, మాజీ విధానకర్తలు ఆదివారం ఇలాగే స్పందించారు.
షికాగో విశ్వవిద్యాలయంలో రాజన్ సహచరుడైన లుయిగి జింగలేస్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రాజన్ నిష్క్రమణ భారత్‌కు తీరని నష్టాన్ని మిగులుస్తుందన్నారు. అలాగే హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ రాజన్ నిర్ణయం చాలా అసంతృప్తికి గురి చేసిందన్నారు. ప్రభుత్వంలోని ఒక వర్గం నుంచి రాజన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆ విమర్శలను తట్టుకోవడం కంటే రాజన్‌ను సాగనంపడమే మేలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావించిందని పలువురు నిపుణులు విమర్శించారు. అయితే దేశ ప్రయోజనాలపట్ల రఘురామ్ రాజన్ చిత్తశుద్ధికి ఏం సమాధానం చెబుతారని వారు ప్రభు త్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఆర్‌బిఐ గవర్నర్ రేసులో ఎస్‌బిఐ చీఫ్

న్యూఢిల్లీ: ఆర్‌బిఐ గవర్నర్‌గా ఈ ఏడాది సెప్టెంబర్ 4న రఘురామ్ రాజన్ పదవీకాలం ముగుస్తుండటంతో ఆయన వారసులేవరన్నదానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు మొదలయ్యాయి. ఆర్‌బిఐకి తర్వాతి గవర్నర్ రేసులో 12 మందికిపైగా పేర్లు వినిపిస్తుండగా, ఇందులో ఆర్‌బిఐ డిప్యూటి గవర్నర్ ఊర్జిత్ పటేల్, మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య తదితరులున్నారు. ఈ సెప్టెంబర్‌తో ఎస్‌బిఐ చైర్‌పర్సన్ పదవీకాలం భట్టాచార్యకు ముగుస్తుంది. రెండోసారి ఆర్‌బిఐ గవర్నర్‌గా కొనసాగాలని లేదంటూ రాజన్.. శనివారం ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ త్వరలోనే ఖాళీని భర్తీ చేస్తామని ప్రకటించినది తెలిసిందే. ఈ క్రమంలో కొత్త గవర్నర్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లలో ఆర్థిక ముఖ్య సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్, ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు, రెవిన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి మాజీ సలహాదారు పార్థసారథి షోమ్, బ్రిక్స్ బ్యాంక్ అధిపతి కెవి కామత్, సెబీ చైర్మన్ యుకె సిన్హా ఉన్నారు. అలాగే ఆర్‌బిఐ మాజీ డిప్యూటి గవర్నర్లు రాకేశ్ మోహన్, సుబిర్ గోకర్ణ్, ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి విజయ్ కేల్కర్, సిసిఐ మాజీ చైర్మన్ అశోక్ చావ్లా, మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అశోక్ లహ్రీ, ప్రముఖ ఆర్థికవేత్త ఆర్ వైద్యనాథన్ పేర్లూ వినిపిస్తున్నాయి. 2013 సెప్టెంబర్ 4న కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యుపిఎ ప్రభుత్వం రాజన్‌ను ఆర్‌బి ఐ గవర్నర్‌గా నియమించినది తెలిసిందే. రాజన్ కంటే ముందు 1992 నుంచి గమనిస్తే ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన వారంతా కూడా వరుసగా రెండుసార్లు ఆ పదవిలో కొనసాగారు. సి రంగరాజన్ (1992-97), బిమల్ జలాన్ (1997-2003), వైవి రెడ్డి (2003-08), దువ్వూరి సుబ్బారావు (2008-13) తొలుత మూడేళ్లు, ఆ తర్వాత రెండేళ్ల చొప్పున మొత్తం ఐదేళ్లపాటు ఆర్‌బిఐ గవర్నర్‌గా కొనసాగారు. కానీ 24 సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాజన్ మాత్రం మూడేళ్లకే పరిమితమవుతున్నారు.

స్టాక్ మార్కెట్‌పై ‘రెగ్జిట్’ ప్రభావం?
బ్రెగ్జిట్ ఆందోళనలకు తోడైన రాజన్ నిష్క్రమణ నిర్ణయం
సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం
ఈ వారం మార్కెట్ సరళిపై నిపుణుల అంచనా
న్యూఢిల్లీ, జూన్ 19: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా రెండోసారి కొనసాగలేనని రఘురామ్ రాజన్ స్పష్టం చేసిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోను కావచ్చంటున్నారు నిపుణులు. ఈ వారం, ముఖ్యంగా సోమవారం ట్రేడింగ్‌ను రాజన్ నిర్ణయం ప్రభావితం చేయవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గొప్ప ఆర్థికవేత్తగా పేరున్న రాజన్.. మరోసారి తాను ఆర్‌బిఐ గవర్నర్‌గా కొనసాగలేనని శనివారం ఆర్‌బిఐ సిబ్బందికి ఓ సందేశాన్నిచ్చినది తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 4తో ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగుస్తుంది. ఈ క్రమంలో సెకండ్ టర్మ్‌పై ఆశ లేదని రాజన్ స్పష్టం చేశారు. అయితే దీనిపై దేశ పారిశ్రామిక, వ్యాపార రంగాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి, ఆనంద్ మహీంద్ర తదితర పారిశ్రామిక దిగ్గజాలు.. రాజన్ నిర్ణయాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టంగా అభివర్ణించాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజన్ మరికొంతకాలం ఆర్‌బిఐ గవర్నర్‌గా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో మదుపరులు కూడా ఇదే భావనతో ఉంటారని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ఆర్‌బిఐ గవర్నర్‌గిరీ చర్చనియాంశమైన క్రమంలో నెటిజన్లు పెద్ద ఎత్తున రాజన్‌కు మద్దతు పలికినది తెలిసిందే. దీంతో మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరచకపోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ఐరోపా యూనియన్‌లో కొనసాగాలా? వద్దా? అన్నదానిపై (బ్రెగ్జిట్) బ్రిటన్ రెఫరెండమ్‌కు వెళ్తున్న క్రమంలో ప్రపంచ మార్కెట్లన్నీ డోలాయమానంలో పడ్డాయి.
భారత మార్కెట్లకైతే బ్రెగ్జిట్‌కు రెగ్జిట్ కూడా తోడైంది. దీంతో స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకుల్లోనే పయనించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. స్టాక్ మార్కెట్లతోపాటు కరెన్సీ మార్కెట్లు కూడా రాజన్ వ్యవహారంపై స్పందిస్తాయని అంటున్నారు. ఇకపోతే అంతర్జాతీయ పరిణామాలు, ప్రధానంగా 23న బ్రెగ్జిట్ రెఫరెండమ్, దాని ఆధారంగా ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్ల కదలికలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరలు, విదేశీ మదుపరుల పెట్టుబడులు, వర్షాల తీరు ఈ వారం మార్కెట్ సరళిని నిర్దేశిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
గత వారం స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల నడుమ దాదాపు యథాతథంగా ముగిసిన నేపథ్యంలో రాజన్ నిష్క్రమణ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై చూపితే ఈ వారం కూడా మార్కెట్లకు ప్రతికూలమేనని మార్కెట్ విశే్లషకులు చెబుతున్నారు. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ గత వారం 9.84 పాయంట్లు నష్టపోయ 26,625.91 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ అతి స్వల్పంగా 0.15 పాయంట్లు తగ్గి 8,170.20 వద్ద నిలిచింది. మొత్తానికి ఈ వారం రెగ్జిట్ వ్యవహారం అనుకోకుండా ప్రాధాన్యతను సంతరించుకుంది.