బిజినెస్

విదేశీ మదుపరులకు జిఎస్‌టి దిగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భారతీయ ఆర్థిక వ్యవస్థపై విదేశీ మదుపరులకు భయాలు పెరుగుతున్నాయ. ముఖ్యంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) దిగులు పట్టుకుంది. దేశీయ మార్కెట్లలో నెలనెలా వారి పెట్టుబడులు అంతకంతకూ పడిపోతుండటమే దీనికి నిదర్శనం. స్టాక్ మార్కెట్లలో గత వారం విదేశీ మదుపరులు మళ్లీ పెట్టుబడుల దిశగా నడిచినప్పటికీ స్వల్ప పెట్టుబడులతోనే సరిపెట్టారు. నిజానికి ఈ నెలలో అంతకుముందు వారం వరకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)లు దాదాపు 5,500 కోట్ల రూపాయల పెట్టుబడులను లాగేసుకున్నారు. నవంబర్‌లోనూ ఎఫ్‌పిఐలు స్టాక్ మార్కెట్ల నుంచి 7,074 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జిఎస్‌టి బిల్లుపై నెలకొన్న సందిగ్ధత స్టాక్ మార్కెట్లను తీవ్ర ఒడిదుడుకులకు లోను చేస్తోంది మరి. బిల్లు ఆమోదంపై ఏర్పడుతున్న అనుమానాలే దీనికి కారణం.
అయతే గత వారం రోజుల్లో ఈ ధోరణిలో కాస్త మార్పు చోటుచేసుకున్న సంకేతాలు కనిపించాయ. ఈ నెల 14-18 తేదీల్లో భారతీయ స్టాక్ మార్కెట్లలోకి 242.94 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు తెచ్చారు. జిఎస్‌టి రేటు 18 శాతం దిగువనే ఉంటుందని, కాంగ్రెస్ డిమాండ్‌కు అనుగుణంగా 1 శాతం అదనపు పన్నును విరమిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం మదుపరుల దృష్టిని పెట్టుబడుల వైపునకు మళ్లించింది. పారిశ్రామికోత్పత్తి సూచీ సైతం పుంజుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది. ఈ క్రమంలోనే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ సుధీర్ఘకాలం తర్వాత వడ్డీరేటును పావు శాతం పెంచినప్పటికీ మదుపరులు పట్టించు కోలేదు. అయతే ఈ జోష్ నిలకడగా సాగుతుందా? అన్నది ప్రశ్నార్థకమే. కాగా, ఈ నెల 1-11 తేదీల్లో 5,487 కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించు కున్నారు. అయతే గత వారం 242 కోట్ల రూపాయలు రావడంతో మొత్తం ఈ నెలలో ఇప్పటిదాకా 5,245 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయ నట్లైంది. ఇదిలావుంటే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్ల నుంచి 23,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు ఉపసంహరిం చుకున్నారు. అయతే అక్టోబర్‌లో స్టాక్, రుణ మార్కెట్లలోకి తిరిగి 22,350 కోట్ల రూపాయల (3.44 బిలియన్ డాలర్లు) పెట్టుబడులను పట్టుకొచ్చారు. ఫలితంగా అక్టోబర్ నెలలో ఏడు నెలల గరిష్ఠానికి ఎఫ్‌పిఐ పెట్టుబడులు చేరినట్లైంది. మార్చి (రూ. 20,723 కోట్లు) తర్వాత మళ్లీ అక్టోబర్‌లోనే భారీగా విదేశీ పెట్టుబడులు తరలివచ్చాయ. కాగా, ప్రపంచ ఆర్థిక మందగమనం మధ్య సెప్టెంబర్‌లో 5,784 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు వెనక్కి తీసుకోగా, అంతకుముందు నెల ఆగస్టులో ఏకంగా 17,524 కోట్ల రూపాయలను గుంజేసుకున్నారు. 1997 నుంచి కేవలం ఒక్క నెలలో భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు ఈ స్థాయలో తరలిపోవడం ఇదే (1997కు ముందు సమాచారం లేదు).
మరోవైపు ఈ ఏడాది ఆరంభం నుంచి గమనిస్తే ఏప్రిల్ వరకు దేశీయ మార్కెట్లలో నెలసరి విదేశీ పెట్టుబడులు క్రమేణా తగ్గుతూ వచ్చాయ. జనవరిలో 33,688 కోట్ల రూపాయలుగా ఉన్న ఎఫ్‌పిఐ పెట్టుబడులు.. ఫిబ్రవరిలో 24,564 కోట్ల రూపాయలుగా, మార్చిలో 20,723 కోట్ల రూపాయలుగా, ఏప్రిల్‌లో 15,333 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మే, జూన్ నెలల్లో పెట్టుబడులు రాకపోగా, వెనక్కి వెళ్లిపోయాయి. మే నెలలో 14,272 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలిపోయాయ. జూన్‌లో 1,608 కోట్ల రూపాయల పెట్టుబడులను ఎఫ్‌పిఐలు లాగేసుకున్నారు. జూలైలో మళ్లీ పెట్టుబడుల రాక మొదలైనా.. ఆగస్టులో తిరిగి పెట్టుబడుల పోకడే మిగిలింది. జూలైలో 5,323 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. దీంతో పరిస్థితులు మళ్లీ గాడిలో పడ్డాయనుకుంటే ఆగస్టులో అందుకు విరుద్ధంగానే ఫలితాలు నమోదయ్యాయ. సెప్టెంబర్ లోనూ తీరు మారలేదు. అయతే ఆర్‌బిఐ అనూహ్యంగా సెప్టెంబర్ 29న నిర్వహించిన నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లైన రెపో, రివర్స్ రెపోలను 50 బేసిస్ పాయంట్ల చొప్పున తగ్గించడంతో నష్టాల నుంచి తేరుకున్న స్టాక్ మార్కెట్లు అక్టోబర్‌లో లాభాల్లో కదలాడాయ. కానీ నవంబర్‌లో పెట్టుబడుల ఉపసంహరణే జరిగింది. డిసెంబర్‌లోనూ అదే తీరు కనిపిస్తోంది. మొత్తానికి నానాటికీ షేర్ల అమ్మకాల వైపే ఎఫ్‌పిఐల పయనం సాగుతోంది.