బిజినెస్

బ్రెగ్జిట్ దెబ్బకు రూపాయి విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 24: బ్రెగ్జిట్ ప్రభావం కరెన్సీ మార్కెట్లపై తీవ్రంగా పడింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ శుక్రవారం 72 పైసలు క్షీణించి 67.96 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో రూపాయికిపైగా నష్టపోయింది. ఎగుమతిదారుల నుంచి రూపాయి అమ్మకాలు పెరిగిపోయాయి. అయితే స్టాక్ మార్కెట్లు కోలుకున్నకొద్దీ రూపాయి విలువ కూడా బలపడింది. అటు అంతర్జాతీయంగా వివిధ దేశాల కరెన్సీ విలువలూ క్షీణించాయి. బ్రిటన్ కరెన్సీ పౌండైతే ఏకంగా 31 ఏళ్ల కనిష్ట స్థాయికి దిగజారింది. కరెన్సీ మార్కెట్లు మున్ముందు కూడా ఒడిదుడుకులకు గురికావచ్చని నిపుణులు అంటున్నారు. బ్రెగ్జిట్ ప్రభావం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.