బిజినెస్

సింగరేణికి జాతీయ స్థాయిలో అత్యద్భుత పనితీరు అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,జూన్ 24: సింగరేణి సంస్థ గత ఆర్ధిక సంవత్సరంలో 15 శాతం వృద్ధిరేటుతో ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతికి జాతీయ స్ధాయిలో గుర్తింపు లభించినట్లు ఆ సంస్థ సిఎండి ఎన్ శ్రీ్ధర్ తెలిపారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ జాతీయ స్థాయిలో అత్యుత్తమ పనితీరుకు ఇచ్చే సామర్థ్యపు అవార్డును ఈ ఏడాది సింగరేణికి సంస్థకు ప్రకటించినట్లు ఆయన చెప్పారు. శుక్రవారం నాగపూర్‌లో జరిగిన 20వ జాతీయ స్ధాయిలో సిఇవోల సదస్సులో ఈ అవార్డును డైరక్టెర్ జె పవిత్రన్ కుమార్ స్వీకరించినట్లు ఆయన తెలిపారు. ఈ అవార్డును గతంలో సింగరేణి సిఎండిగా పనిచేసిన ఆర్‌హెచ్ ఖ్వాజా నుంచి పవిత్రన్ స్వీకరించారు.