బిజినెస్

రుణ మార్కెట్లకు దూరంగా ఎఫ్‌పిఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: విదేశీ మదుపరులు దేశీయ రుణ మార్కెట్లంటేనే దూరంగా ఉంటున్నారు. మదుపునకు జంకుతున్నారు. గతంలో పెట్టిన పెట్టుబడులను సైతం లాగేసుకుంటున్నారు. ఈ ఏడాది ఆరంభం నుంచి 11,500 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు మరి. ఈ నెలలోనే ఇప్పటిదాకా 6,189 కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. గత నెల మేలో కూడా 4,409 కోట్ల రూపాయల పెట్టుబడులను గుంజేసుకున్నారు. యూరోపి యన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలుగుతుందన్న భయాలు విదేశీ మదుపరు లను రుణ మార్కెట్ల వైపు చూడనివ్వలేదు. బ్రెగ్జిట్‌కే బ్రిటనీయుల మద్దతు పలకడంతో భారతీయ రుణ మార్కెట్లకు మరింత దూరమ య్యారు ఎఫ్‌పిఐలు. కాగా, స్టాక్ మార్కెట్లలోకి మాత్రం పెట్టుబడులను తెస్తున్నారు విదేశీ మదుపరులు. ఈ నెలలో ఇప్పటిదాకా 4,429 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచి న విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలోకి 32,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు పట్టుకొచ్చారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాలు మదుపరులను విపరీతంగా ఆకట్టుకోగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఏప్రిల్‌లో జరిపిన తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపో రేటును ఐదేళ్ల కనిష్టానికి తగ్గిస్తూ 6.5 శాతానికి తీసుకురావడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. అయతే అంతకుముందు రెండు నెలలతో పోల్చితే మే నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మాత్రం తక్కువే. 2,543 కోట్ల రూపా యల పెట్టుబడులు మాత్రమే గత నెల భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. జూన్ నెలలో బ్రెగ్జిట్ ప్రభావం పడగా, గత వారం భారీ నష్టాలకు లోనైనది తెలిసిందే. కాగా, జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 19,883 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే రుణ మార్కెట్ల నుంచి 11,537 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపో యాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 8,345 కోట్ల రూపాయలుగా నమోదైంది.