బిజినెస్

భారీ టెక్స్‌టైల్ హబ్‌గా వరంగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, డిసెంబర్ 20: వరంగల్ జిల్లా మడికొండ పరిధిలోగల కాకతీయ సొసైటీకి కేంద్ర ప్రభుత్వం టెక్స్‌టైల్ పార్కు సమగ్ర అభివృద్ధికిగాను వౌలిక వసతుల కల్పన కోసం 161 ఎకరాల భూమిని కేటాయంచినది తెలిసిందే. మొదటి దశలో 364 మంది చేనేత కార్మికులకు పవర్‌లూమ్స్ ఏర్పాటుకు వీలుగా రూ. 10 కోట్ల నిధులను కూడా కేటాయించినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.
ఆదివారం కాకతీయ సొసైటీ సభ్యులు టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ 161 ఎకరాల్లో మొదటి దశలో 364 మంది చేనేత కార్మికులకు కేటాయించిన భూములను వెంటనే లేఅవుట్ పూర్తి చేసి డిసెంబర్ నెలాఖరులోగా డ్రా ద్వారా ఫ్లాట్లను కేటాయించాలన్నారు. కనీస వసతులైన రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థ, పరిపాలన భవనంతో పాటు చుట్టూ ప్రహరీ నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సూరత్‌లో వరంగల్ జిల్లా నుండి అనేక మంది చేనేత కార్మికులు వలసపోయి పని చేస్తున్నారని, ఈ క్రమంలో వారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తామన్నారు.
గతంలో సూరత్‌లో పర్యటించి తెలంగాణ వలస కార్మికులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరిగిందన్నారు. కాగా, ఈ సొసైటీల్లో వ్యక్తిగతంగా పవర్‌లూమ్స్ ఏర్పాటుకు ఒక యూనిట్‌కు కోటి రూపాయలు అవసరం ఉంటుందని, బ్యాంకు టైఅప్ చేసుకొని వెంటనే యూనిట్ స్థాపనకు చర్యలు తీసుకోవాలన్నారు. పక్కనే ఉన్న కార్పొరేషన్ డంపింగ్ యార్డు ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించేందుకూ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సొసైటీ ద్వారా చేపట్టే యూనిట్ల ద్వారా 2 వేల మందికి ప్రత్యక్షంగా, 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. వరంగల్ చుట్టు పక్కల 3 వేల ఎకరాల్లో భారీ టెక్స్‌టైల్ హబ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనీ తెలిపారు. త్వరలోనే స్థల సేకరణ చేసి టెక్స్‌టైల్ హబ్ చేపట్టడం జరుగుతుందని, తద్వారా లక్ష మందికి ఉపాధి కల్పించడబడుతుందని తెలిపారు.

అభివృద్ధి పనులను తెలుసుకుంటున్న కడియం, సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం