బిజినెస్

15 బిలియన్ డాలర్లతో ఫోక్స్‌వాగన్ సెటిల్మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెట్రాయిట్, జూన్ 28: జర్మనీ ఆటోరంగ దిగ్గజం ఫోక్స్‌వాగన్.. కర్బన ఉద్గారాల చీటింగ్ కేసులను పరిష్కరించుకోవడంలో భాగంగా భారీ నష్టపరిహారానికి అంగీకరించింది. 15 బిలియన్ డాలర్లకుపైగా చెల్లించేందుకు ముందుకొచ్చింది. తమ చీటింగ్‌తో మోసపోయిన కార్ల యజమానులకు నష్టపరిహారంగానే ఇందులో 10 బిలియన్ డాలర్లను కేటాయించింది. 5,100 డాలర్ల నుంచి 10,000 డాలర్ల వరకు యజమానులకు నష్టపరిహారంగా ఇవ్వనుంది. అమ్మిన కార్లను కొనడమేగాక రిపేర్ ఖర్చులను భరించనుంది. ఈ మేరకు సెటిల్మెంట్ వివరాలను మంగళవారం శాన్‌ఫ్రాన్సిస్కోలోని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు వెల్లడించింది.

దేశంలో హోటళ్ల
బుకింగ్‌కు ఒవైఒ యాప్
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 28: దేశంలోని వివిధ హోటళ్లలో రూములు బుక్ చేసుకోదలిచే ట్రావెలర్స్ కోసం ఒవైఒ సంస్థ ‘ఒవైఒ ఫర్ బిజినెస్’ అనే మొబైల్ యాప్‌ను రూపొందించింది. కార్పోరేట్, వాణిజ్య, సాధారణ ట్రావెలర్స్‌కు ఈ యాప్ ఉపయోగపడుతుందని ఒవైఒ సిఇఒ రితీష్ అగర్వాల్ తెలిపారు. 180 నగరాల్లో ఆరు వేల హోటళ్ల వివరాలు ఇందులో ఉంటాయి. తాము ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా నిర్వహించినప్పుడు మంచి స్పందన వచ్చిందన్నారు. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించామన్నారు. ఐటిసి లిమిటెడ్, భారతి ఎయిర్‌టెల్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్, టెక్‌మహీంద్ర, ఎర్నెస్ట్ అండ్ యంగ్, బెనె్నట్ కోల్మన్ కంపెనీ, ఏఎండబ్ల్యు మోటార్స్, హిటాచీ, స్టార్టప్స్, డిల్లీవెరీ, గోఫెర్స్, ఇండియామార్ట్ సంస్థలు తమ సేవలను ఉపయోగించుకున్నాయని ఆయన చెప్పారు.

శ్రీరాం జీవిత బీమా సంస్థకు
ప్రతిష్ఠాత్మక అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 28: పట్టణేతర ప్రాంతాల్లో బీమా విక్రయాల కవరేజిలో అత్యుత్తమ స్థానం సాధించినందుకు శ్రీరాం జీవిత బీమా సంస్థకు ప్రతిష్ఠాత్మకమైన ఇండియా ఇన్సురెన్స్ అవార్డు లభించింది. శ్రీరాం బీమా సంస్థ ఎండి మనోజ్ జైన్, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు అరవింద్ షివారే ఈ అవార్డును ముంబయిలో జరిగిన కార్యక్రమంలో లైఫ్ ఇన్సురెన్స్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ వి మాణిక్యం చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీరాం బీమా సంస్థ ఎండి మనోజ్ జైన్ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో తమ సంస్థ దేశం మొత్తం మీద మొదటి ఏడు ప్రైవేట్ బీమా సంస్థల్లో ఒకటిగా నిలిచిందన్నారు. 2.65 లక్షల బీమా పాలసీలను విక్రయించినట్లు చెప్పారు.

పొల్యూషన్ చెక్ సెంటర్లలో మోటార్ పాలసీలు
న్యూఢిల్లీ, జూన్ 28: మోటార్ థర్డ్ పార్టీ పాలసీలు త్వరలో కాలుష్య తనిఖీ కేంద్రాల్లోనూ లభించనున్నాయి. దీనికి సంబంధించిన నిబంధనలను సరళతరం చేయాలన్న ప్రతిపాదనకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత ఐఆర్‌డిఎఐ రెగ్యులేషన్స్, 2016లో నిబంధనలను సడలిస్తూ ఐఆర్‌డిఎఐ నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌డిఎఐ 92వ సమావేశంలో ఈ నిర్ణయం వెలువడగా, పొల్యూషన్ చెక్ సెంటర్లతోపాటు ఇతర ఏజెన్సీలు మోటార్ థర్డ్ పార్టీ పాలసీల వంటి సరళతర బీమా పాలసీలను జారీ చేసుకునే అవకాశం రానుందని తెలుస్తోంది.

ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌గా విశ్వనాథన్
న్యూఢిల్లీ, జూన్ 28: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నూతన డిప్యూటీ గవర్నర్‌గా ఎన్‌ఎస్ విశ్వనాథన్ ఎన్నికయ్యారు. వచ్చే వారం పదవీ విరమణ పొందుతున్న హెచ్‌ఆర్ ఖాన్ స్థానంలో ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. విశ్వనాథన్ ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ విశ్వనాథన్‌ను ఖాన్ వారసుడిగా ఎంపిక చేసింది. ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి నియామకం ఇదే. కాగా, సెర్చ్ కమిటీ సిఫార్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది.

గ్లోబల్ లాజిస్టిక్స్ ప్రదర్శనలో
భారత్‌కు మెరుగైన ర్యాంక్
వాషింగ్టన్, జూన్ 28: గ్లోబల్ లాజిస్టిక్స్ ప్రదర్శనలో తాజాగా ప్రపంచ బ్యాంక్ వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో భారత్ తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. ఏకంగా 19 స్థానాలు ఎగబాకింది. ఇంతకుముందు 2014లో వెల్లడించిన ఈ ర్యాంకింగ్స్‌లో 54వ స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు 35వ స్థానానికి చేరుకుంది. కాగా, జాబితాలో జర్మనీ మూడోసారి అగ్రస్థానం పొందగా, ఆ తర్వాత లగ్జెంబర్గ్, స్వీడన్, నెదర్లాండ్స్, సింగపూర్ దేశాలున్నాయి.
‘్భరత ఆర్థిక వ్యవస్థ బలమైనది’
ముంబయి, జూన్ 28: అంతర్జాతీయ అనిశ్చితి, బ్యాంకింగ్ రంగ సమస్యలతో భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ఇబ్బందేమీ లేదని, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోల్చితే దేశ ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మంగళవారం విడుదల చేసిన ఓ నివేదిక తెలిపింది. ఫైనాన్షియల్ స్టెబిలిటి రిపోర్ట్ (ఎఫ్‌ఎస్‌ఆర్) పేరిట వచ్చిన ఈ నివేదికలో వచ్చే మార్చి నాటికి బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల స్థాయి 9.3 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ఈ ఏడాది మార్చి నాటికిది 7.6 శాతంగా ఉంది. ఇక బ్యాంకులు మొండి బకాయిలపై కాకుండా ఒత్తిడిని ఎదుర్కొంటున్న రుణాలపై ముందుగా దృష్టి పెట్టాలని, అవి మొండి బకాయిలుగా మారకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి, జూన్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో తొలగిన బ్రెగ్జిట్ భయాల మధ్య దేశీయ సూచీలూ లాభాలను నమోదు చేశాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 121.59 పాయింట్లు పుంజుకుని 26,524.55 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 33.15 పాయింట్లు పెరిగి 8,127.85 వద్ద నిలిచింది. ఎఫ్‌ఎమ్‌సిజి, మెటల్, చమురు, గ్యాస్, ప్రభుత్వరంగ సంస్థల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయంగా ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లలో జపాన్, షాంగై సూచీలూ లాభపడ్డాయి.

పసుపు ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్

వ్యవసాయ మంత్రి పోచారం
ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడి

హైదరాబాద్, జూన్ 28: పసుపు ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొద టి స్థానంలో కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రవాణా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం బాబగూడ గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వ సాయంతో 150 మంది రైతులు చేపట్టిన శాశ్వత పందిళ్ల ద్వారా కూరగాయల సాగును మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, రాష్టవ్య్రాప్తంగా ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్నామన్నారు. తెలంగాణ రైతాంగానికి వివిధ పథకాల ద్వారా రాయితీ ఇస్తున్నామని వెల్లడించారు. జాతీయ స్థాయిలో పండ్ల సాగులో మూడో స్థానంలో, పసుపు సాగులో మొదటి స్థానంలో ఉందన్నారు. పూలసాగు 20 వేల ఎకరాల్లో కొనసాగుతోందని, ఈ విస్తీర్ణాన్ని మరిం త పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కాయగూరలు, సుగంధ ద్రవ్యాల సాగు విస్తీర్ణం కూడా పెంచుతున్నామన్నారు. రైతులకు పెట్టుబడి తగ్గించేందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పోచారం వెల్లడించారు. వ్యవసాయ పరికరాలను, విత్తనాలను సబ్సిడీపై ఇస్తున్నామన్నారు. కాగా, వ్యవసాయ ఉద్యాన పంటలను శాస్ర్తియ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామని మంత్రి తెలిపారు. మంత్రుల వెంట ఉద్యాన శాఖ కమిషనర్ వెంకట్‌రాంరెడ్డి తదితరులు ఉన్నారు.