బిజినెస్

నియోటెల్ వాటాను అమ్మేస్తున్న టాటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: దక్షిణాఫ్రికాకు చెందిన ఇంటర్నెట్-సర్వీస్ ప్రొవైడర్ నియోటెల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో టాటా కమ్యూనికేషన్స్.. తమ మెజారిటీ వాటాను అమ్మేస్తోంది. టెలీకమ్యూనికేషన్స్ సంస్థ ఎకోనెట్ వైర్‌లెస్ గ్లోబల్‌కు 293 మిలియన్ డాలర్ల (దాదాపు 1,992 కోట్ల రూపాయలు)కు ఈ వాటాను టాటా కమ్యూనికేషన్స్ విక్రయిస్తోంది. ఎకోనెట్ వైర్‌లెస్ గ్లోబల్‌లో మెజారిటీ వాటా లిక్విడ్ టెలికామ్‌కు ఉండగా, నియోటెల్ కొనుగోలుకు ఒప్పందం కుదిరినట్లు టాటా కమ్యూనికేషన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, టాటా కమ్యూనికేషన్స్‌తోపాటు నెక్సస్ కనెక్షన్ నేతృత్వంలోని మైనారిటీ భాగస్వాములకు ఎకోనెట్ వైర్‌లెస్ గ్లోబల్ మొత్తం 428 మిలియన్ డాలర్ల (6.55 బిలియన్ ర్యాండ్)ను చెల్లించనుంది. ఈ కొనుగోలుతో ఆఫ్రికా ఖండంలోనే అతిపెద్ద బ్రాడ్‌బాండ్ నెట్‌వర్క్‌గా ఎకోనెట్ వైర్‌లెస్ గ్లోబల్ అవతరిస్తుంది. అలాగే బిజినెస్-టు-బిజినెస్ టెలీకమ్యూనికేషన్స్ సర్వీస్‌గా కూడా ఏర్పడుతుంది.
2009లో నియోటెల్‌లో 68.5 శాతం వాటాను టాటా కమ్యూనికేషన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజా లావాదేవీల్లో భాగంగా నియోటెల్‌లో 30 శాతం వాటాను రాయల్ బఫోకెంగ్ హోల్డింగ్స్ అందుకోనుంది. అయితే జోహెనె్నస్‌బర్గ్‌కు చెందిన వొడాకామ్ గ్రూప్ లిమిటెడ్ 7 బిలియన్ ర్యాండ్‌లతో నియోటెల్‌ను కొనుగోలు చేస్తామని నాలుగు నెలల క్రితం చేసిన ప్రతిపాదన నేపథ్యంలో అంతకంటే తక్కువకే లిక్విడ్ టెలికామ్ అనుబంధ సంస్థకు అమ్ముడవడం గమనార్హం. కాగా, నియోటెల్, టాటా కమ్యూనికేషన్స్ ఆఫ్ ఇండియా వాటాదారులు, నెక్సస్ కనెక్షన్ నేతృత్వంలోని మైనారిటీ భాగస్వాములు నియోటెల్ అమ్మకాన్ని ఆమోదించారు. ఈ మేరకు ఇరు వైపుల సంస్థలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇక నియోటెల్ కొనుగోలుపట్ల ఆనందం వ్యక్తం చేసిన లిక్విడ్ టెలికామ్ సిఇఒ నిక్ రుడ్నిక్.. మున్ముందు మరిన్ని పెట్టుబడులు పెడతామని స్పష్టం చేశారు. టాటా కమ్యూనికేషన్స్ ఎండి, సిఇఒ వినోద్ కుమార్ స్పందిస్తూ నియోటెల్ టేకోవర్‌కు లిక్విడ్ టెలికామ్ సరైనదని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ లావాదేవీకి దక్షిణాఫ్రికా రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో ఆమోదం రావచ్చని ఇరు సంస్థలు భావిస్తున్నాయి.