బిజినెస్

రూ. 4 వేల కోట్లతో 9 ప్లాంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం ఐటిసి.. రాబోయే 2-3 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఆహారోత్పత్తుల తయారీ కోసం 8 నుంచి 9 భారీ కర్మాగారాలను నిర్మించబోతోంది. ఇందుకు 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. ‘రాబోయే 2-3 సంవత్సరాల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో భారీ స్థాయిలో 8-9 ఆహారోత్పత్తుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని మేము భావిస్తున్నాం.’ అని ఐటిసి ఫుడ్స్ సిఇఒ విఎల్ రాజేశ్ మంగళవారం పిటిఐకి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఐటిసి బ్రాండ్ ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తుల అమ్మకాలు దాదాపు 11 శాతం వృద్ధి చెందగా, 7,097.49 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదైంది. బహుళ వ్యాపార సంస్థ అయిన ఐటిసిలో సిగరెట్ల తర్వాత అతిపెద్ద వ్యాపార విభాగం ఆహారోత్పత్తులదే. ఆరోగ్య సమస్యలతో బాధపడేవారి కోసం పరిచయం చేసిన సన్‌ఫీస్ట్ ఫామ్‌లైట్ బిస్కట్ల విభాగాన్ని ఐటిసి ఇటీవల విస్తరించింది కూడా. పరిశ్రమలో ఈ రకం బిస్కట్ల వాటా ప్రస్తుతం ఒక్క శాతంగానే ఉన్నప్పటికీ, ఇది వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ క్రమంలోనే నూత న ప్లాంట్ల దిశగా ఐటిసి వెళ్తోంది. ఇక చక్కెర వ్యాధిగ్రస్తుల కోసం కూడా ప్రత్యేకంగా ఆశిర్వాద్ గోధుమపిండిని ఇటీవల ఐటిసి మార్కెట్‌లోకి విడుదల చేసింది. నిరుడు అక్టోబర్‌లో నెయ్యితో పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి కూడా ఐటిసి అడుగిడింది. ఆహారోత్పత్తుల తయారీలో భాగంగా బెంగళూరులోని సంస్థ ల్యాబ్‌లు, రిసెర్చ్ సెంటర్లలో అన్ని రకాల ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు జరుగుతాయని, ఆ తర్వాతే మార్కెట్‌లోకి ఉత్పత్తులు విడుదలవుతాయని రాజేశ్ చెప్పారు.