బిజినెస్

వాణిజ్య విద్యుదుత్పత్తికి కెటిపిపి రెండో దశ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, డిసెంబర్ 20: విద్యుదు త్పత్తికి కెటిపిపి రెండో దశ 600 మెగావాట్ల కేంద్రం సిద్ధమైంది. ట్రయల్న్ విజయవంతం కావడంతో వాణిజ్య ఉత్పత్తిని చేపట్టి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా అందించేందుకు జెన్‌కో సన్నాహాలు చేస్తోంది. రెండో దశ 600 మెగావాట్ల కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నడిపించి విజయవంతం చేసినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల పాటు ఆగకుండా ప్రాజెక్ట్ నడిపించామన్నారు. ట్రాన్స్‌కోకు విద్యుత్‌ను అందించి వాణిజ్య ఒప్పందాలు జరుగుతాయన్నారు. కాగా, ఉత్పత్తి ప్రక్రియ విజయవంతం కావడంతో అందరి దృష్టి సివోడిపై పడింది. 3 రోజుల పాటు ఉత్పత్తి అయన విద్యుత్‌ను గ్రేడ్‌కు అనుసంధానం చేస్తామని అధికారులు తెలిపారు. పవర్‌గ్రిడ్ కరెంటును కొనుగోలు చేస్తుందన్నారు.
1,100 మెగావాట్లకు చేరిన కెటిపిపి
వరంగల్ జిల్లా గణపురంలోని చెల్పూర్ కెటిపిపి విద్యుదుత్పత్తి ఇప్పుడు 1,100 మెగావాట్లకు చేరుకుంది. మొదటి దశ 500 మెగావాట్లకు తోడు ఇప్పుడు రెండో దశ 600 మెగావాట్ల ప్రాజెక్ట్ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో నడిపించి విజయవంతం చేశారు. మూడు రోజుల పాటు రెండవ దశ ప్రాజెక్ట్‌ను నడిపి ప్రస్తుతం ప్రక్రియను నిలిపి వేశామని కెటిపిపి అధికారులు తెలిపారు. అయితే, ఈనెల 24 లేదా 25 నుండి మళ్లీ ప్రారంభిస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కెటిపిపి రెండో దశ 600 మెగావాట్ల ప్రాజెక్ట్ ప్రారంభం కావడంతో కెటిపిపి 1,100 మెగావాట్లకు చేరుకొని కెటిపిపి సూపర్ పవర్ ప్రాజెక్ట్‌గా మారినట్లు కెటిపిపి అధికారులు తెలిపారు. సిఎం కెసిఆర్ చేతుల మీదుగా సివోడి జరిపించి జనవరిలో ప్రాజెక్ట్‌ను రాష్ట్రానికి అంకితం చేయడానికి కెటిపిపి అధికారులు సిద్ధమయ్యారు.
ప్రత్యేక కార్యాలయం
కెటిపిపి 600 మెగావాట్ల ప్రాజెక్ట్‌కు ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయానికి కొత్తగా బోర్డును కూడా ఏర్పాటు చేశారు. కార్యాలయంలో కేవలం విద్యుదు త్పత్తి పనితీరుపై కంప్యూటర్లలో మెగావాట్లను చూపించే అధునాతన వ్యవస్థ ఉంటుందని.. ఎప్పటికప్పుడు ఈ కార్యాలయం ద్వారా హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధకు ఇంటర్‌నెట్‌లో సమాచారం వెళ్తుందని కెటిపిపి వర్గాలు తెలిపాయి.