బిజినెస్

త్రైమాసిక ఫలితాల్లో సింగరేణి వెనుకంజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 1: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో సింగరేణి సంస్థ పది శాతం వృద్ధిరేటు సాధించాలనే సంకల్పంతో 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కానీ గడచిన మూడు మాసాల ఫలితాలను చూస్తే బొగ్గు ఉత్పత్తిలో సంస్థ వెనుకంజలో ఉంది. కోటి 56 లక్షల 13 వేల టన్నుల ఉత్పత్తిని సాధించాల్సి ఉండగా, కోటి 41 లక్షల 6 వేల 285 టన్నులు సాధించి 90 శాతం ఉత్పాదక రేటును నమోదు చేసుకుంది. మొన్నటివరకు మండుతున్న ఎండలు, తాజాగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రతికూల పరిస్థితులుగా మారి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తున్నాయి. కార్మికులు సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి అహర్నిశలూ కృషి చేస్తున్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బొగ్గు ఉత్పత్తి కొంత మందగించింది. కాగా, త్రైమాసిక ఫలితాలలో సంస్థలోని 11 ఏరియాల్లో ఒక్క శ్రీరాంపూర్ ఏరియా మినహా మిగిలిన పది ఏరియాలు ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో వెనుకబడ్డాయి. ఏరియాల వారీగా ఉత్పత్తి వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెం ఏరియా గడచిన మూడు మాసాలలో 20 లక్షల 95 వేల 400 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా, 20 లక్షల 71 వేల 23 టన్నులతో 99 శాతం ఉత్పాదక రేటును, ఇల్లెందు ఏరియా 8 లక్షల 75 వేల టన్నులకుగాను 7లక్షల 74 వేల 82 టన్నులతో 88 శాతం, మణుగూరు ఏరియా 22 లక్షల 35 వేల టన్నులకుగాను 19 లక్షల 79 వేల 847 టన్నులు సాధించి 89 శాతం, రామగుండం-1 ఏరియా 15 లక్షల 96 వేల 900 టన్నులకుగాను 13 లక్షల 84 వేల 769 టన్నులు సాధించి 87 శాతం, రామగుండం-2 ఏరియా 17 లక్షల 35 వేల 200 టన్నులకుగాను 14 లక్షల 74 వేల 173 టన్నులు సాధించి 85 శాతం, రామగుండం-3 ఏరియా 16 లక్షల 50 వేల టన్నులకుగాను 16 లక్షల 40 వేల 314 టన్నులు సాధించి 99 శాతం, భూపాలపల్లి ఏరియా 9 లక్షల 5 వేల 600 టన్నులకుగాను 8 లక్షల 74 వేల 908 టన్నులు సాధించి 97 శాతం ఉత్పాదకరేట్లను నమోదు చేసుకున్నాయి. అదేవిధంగా ఆడ్రియాల ప్రాజెక్టు 9 లక్షల 39 వేల 500 టన్నుల లక్ష్యానికి 6 లక్షల 87 వేల 404 టన్నులు సాధించి 73 శాతం, బెల్లంపల్లి ఏరియా 15 లక్షల 68 వేల టన్నులకుగాను 15 లక్షల 15 వేల 541 టన్నులు సాధించి 97 శాతం, మందమర్రి ఏరియా 8 లక్షల 61 వేల 600 టన్నులకుగాను 5 లక్షల 33 వేల 6 టన్నులు సాధించి 58 శాతం, శ్రీరాంపూర్ ఏరియా 11 లక్షల 50 వేల 800 టన్నులకుగాను 12 లక్షల 918 టన్నులు సాధించి 104 శాతం ఉత్పాదకరేటును నమోదు చేసుకున్నాయి. మొత్తంగా ఓపెన్‌కాస్టు గనులు 94 శాతం ఉత్పాదక రేటును సాధించగా, భూగర్భ గనులు 78 శాతం సాధించాయి.
జూన్ ఉత్పత్తిలో కొత్తగూడెం అగ్రస్థానం
మరోవైపు గత నెల జూన్‌లో బొగ్గు ఉత్పత్తికి సంబంధించి కొత్తగూడెం ఏరియా సింగరేణి వ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. జూన్ నెల ఉత్పత్తి లక్ష్యం 5.97 లక్షల టన్నులు కాగా 7.08 లక్షల టన్నులు సాధించి 118 శాతం ఉత్పాదక రేటుతో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. మిగిలిన ఏరియాలైన ఇల్లెందు 73 శాతం, మణుగూరు ఏరియా 89 శాతం, రామగుండం-1 ఏరియా 91 శాతం, రామగుండం-2 ఏరియా 86 శాతం, రామగుండం-3 ఏరియా 98 శాతం, భూపాలపల్లి ఏరియా 100 శాతం, ఆడ్రియాల ప్రాజెక్టు 65 శాతం, బెల్లంపల్లి ఏరియా 104 శాతం, మందమర్రి ఏరియా 59 శాతం, శ్రీరాంపూర్ ఏరియా 100 శాతం ఉత్పాదక రేట్లను నమోదు చేసుకున్నాయి.