బిజినెస్

రూ. 150 కోట్ల విమానం.. కోటికే అడిగింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జూలై 1: పక్కన ఫోటోలో కనిపిస్తున్నది పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయ, బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా ఎగవేసి విదేశాలకు పారిపోయన కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా వ్యక్తిగత విమానం. బకాయల వసూళ్లలో భాగంగా దీన్ని సర్వీస్ ట్యాక్స్ శాఖ వేలం వేయగా, కేవలం ఒక్క బిడ్ మాత్రమే దాఖలైంది. అదికూడా విమానం విలువ 152 కోట్ల రూపాయలుగా నిర్ణయంచి వేలానికి తీసుకువస్తే.. యుఎఇకి చెందిన ఏవియేషన్ సంస్థ అల్నా ఏరో డిస్ట్రిబ్యూషనల్ ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ కేవలం 1.09 కోట్ల రూపాయలతో బిడ్ వేసింది. నిబంధనల ప్రకారం కోటి రూపాయలను డిపాజిట్ కూడా చేసిందీ సంస్థ. దీంతో ఖంగుతిన్న సేవా పన్ను శాఖ అధికారులు వేలాన్ని నిలిపివేశారు. గురువారం సాయంత్రం సేవా పన్ను అధికారిక వేలందారు ఎమ్‌ఎస్‌టిసి ఈ వేలాన్ని నిర్వహించిందని సంబంధిత అధికారి ఒకరు చెప్పారు. కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్ 800 కోట్ల రూపాయలకుపైగా బకాయపడటంతో 2013 డిసెంబర్‌లో సేవా పన్ను శాఖ దీన్ని అటాచ్ చేసినది తెలిసిందే. కాగా, గతంలోనూ బకాయల వసూళ్ల కోసం మాల్యా తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసిన బ్యాంకర్లకు ఇలాంటి అనుభవమే ఎదురవడం గమనార్హం. మొత్తానికి మాల్యా నుంచి ఏ రకంగానూ పైసా వసూలు కాకపోతుండటంతో అటు అప్పులిచ్చిన బ్యాంకులు, ఇటు బకాయలున్న సంస్థలు తలలు పట్టుకుంటున్నాయ.