బిజినెస్

శ్రీసిటిని సందర్శించిన చైనా వాణిజ్య సంస్థల ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తడ, జూలై 1: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులో అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొన్న శ్రీసిటి పారిశ్రామిక వాడను శుక్రవారం చైనా వాణిజ్య సంస్థల ప్రతినిధుల బృందం సందర్శించింది. చైనాలోని షెజియాంగ్ రాష్ట్రం నుండి విచ్చేసిన పది మంది సభ్యుల బృందానికి శ్రీసిటి వ్యవస్థాపకుడు రవీంద్ర సన్నారెడ్డి ఘనంగా స్వాగతం పలికి పారిశ్రామికంగా శ్రీసిటి సాధించిన ప్రగతిని గురించి వివరించారు. అనంతరం వారు వివిధ ప్రాంతాలను తిరిగి సెజ్‌లో వెలసిన పాల్స్‌ఫ్లస్ బొమ్మల కంపెనీని సందర్శించారు. ఈ సందర్భంగా సన్నారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి వాణిజ్య సంస్థల ప్రతినిధుల బృందం పర్యటన వల్ల చైనా-్భరత్‌ల మధ్య వర్తక, వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు అవకాశముందన్నారు. హిసేహ్ చింగ్ టోంగ్ నేతృత్వంలో వచ్చిన ఈ బృందం.. పెద్ద పారిశ్రామిక వాడను నెలకొల్పి సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎండిని అభినందించింది. సెజ్ వేగంగా అభివృద్ధి చెందాలని ఆశాభావం వ్యక్తం చేసింది.