బిజినెస్

‘నెక్స్ట్ బిగ్ ఐడియా’కు స్పాన్సర్లుగా గూగుల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 1: జోన్ స్టార్టప్స్ ఇండియా, కెనడాలోని ఒంటారియో ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘నెక్స్ట్ బిగ్ ఐడియా’ పోటీకి ఈ ఏడాదికిగాను గూగుల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టిసిఎస్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఈ పోటీ అధిక టెక్నాలజీ, అమిత సామర్థ్యం కలిగిన ఐదు అంకుర సంస్థల (స్టార్టప్)ను ఎంపిక చేయడానికి నిర్దేశించినది. పోటీలో ఎంపికైన స్టార్టప్‌లకు డిఎమ్‌జెడ్ అనే టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ ద్వారా ఉత్తర అమెరికాలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంటుంది. కాగా, ఈ ఏడాది టెక్నాలజీ దిగ్గజం గూగుల్, బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి, ఐటి దిగ్గజం టిసిఎస్‌లు ఈ పోటీకి స్పాన్సర్లుగా వ్యవహరిస్తుండటం పోటీకి మరింత ఆదరణ పెరుగుతుందన్న విశ్వాసాన్ని జోన్ స్టార్టప్స్ డైరెక్టర్ అజయ్ రామసుబ్రమణ్యం వ్యక్తం చేశారు.
ఐటిడిసిలో వాటా విక్రయానికి
ప్రభుత్వం సన్నాహాలు
న్యూఢిల్లీ, జూలై 1: ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటిడిసి)లో 12.03 శాతం వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను మొదలుపెట్టింది. ఈ వాటా అమ్మకంతో ఖజానాకు దాదాపు 260 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ (డిఐపిఎఎమ్).. ఈ వాటా విక్రయానికి మర్చంట్ బ్యాంకర్ల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఈ నెల 21లోగా బిడ్లను దాఖలు చేయాలని తెలిపింది. కాగా, ఐటిడిసి దేశవ్యాప్తంగా హోటళ్లను, రెస్టారెంట్లను నిర్వహిస్తున్నది తెలిసిందే. ఐటిడిసిలో ప్రభుత్వానికి 87.03 శాతం వాటా ఉంది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఐటిడిసి షేర్ విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో గురువారంతో పోల్చితే 3.87 శాతం పడిపోయి 253.50 వద్ద నిలిచింది.
దేశంలో నల్లధనాన్ని
ఉండనివ్వం: హస్ముఖ్ అధియా
ముంబయి, జూలై 1: విదేశాల్లో భారతీయుల నల్లధనం నిల్వలు తగ్గుముఖం పట్టాయన్న గణాంకాల నేపథ్యంలో దేశంలోకి నల్లధనం ఏమాత్రం వచ్చినా.. అది ప్రభుత్వానికి దొరికేలా చర్యలు తీసుకుంటున్నామని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. స్విస్ బ్యాంకుల్లో భారతీయుల అక్రమ సంపద తగ్గిపోతుందని తేలడం శుభ పరిణామంగా పేర్కొన్న ఆయన నల్లధనాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం సరైన దిశగానే వెళ్తోందన్నారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడిన ఆయన గత రెండేళ్లలో 43,000 కోట్ల రూపాయల అక్రమ ఆదాయం వెలుగుచూసిందన్నారు. ఆదాయ పన్ను శాఖ ఈ మేరకు గుర్తించిదని చెప్పారు.